logo

కోడ్‌ ముగిశాకే.. సవరణకు అవకాశం

ఎన్నికల కోడ్‌ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది.

Published : 25 Apr 2024 03:36 IST

గృహజ్యోతి అర్జీదారుల నిరీక్షణ

కామారెడ్డిలో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన మహిళలు (పాతచిత్రం)

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌: ఎన్నికల కోడ్‌ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. అయితే దీని విధివిధానాలు లబ్ధిదారులకు తెలియకపోవడం, ఆపరేటర్లు తప్పిదాలు చేయడం వంటి కారణాలతో ఎంతో మంది పథకానికి దూరమయ్యారు. సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించినా ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో కోడ్‌ పూర్తయ్యే వరకు గృహజ్యోతి దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

ప్రజాపాలన కేంద్రాల వద్ద..

జిల్లాలో నెలకు 200 యూనిట్ల వరకు వాడే వినియోగదారుల వివరాలను విద్యుత్తుశాఖ అధికారులు జనవరిలో లెక్కలు తీశారు. జిల్లాలో 2.53 లక్షల ఆహార భద్రత కార్డులున్నాయి. వీరంతా పథకానికి అర్హులవుతారు. ప్రస్తుతం చాలా మంది ఆహారభద్రత కార్డులు పట్టుకుని ప్రజాపాలన సేవాకేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. కానీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో నిరాశ పడుతున్నారు.

సంఖ్య పెరిగే అవకాశం..  

విద్యుత్తు మీటర్లు ఉండి ఆహారభద్రత కార్డులు లేని కుటుంబాలు జిల్లాలో ఉన్నాయి. వీరికి ప్రభుత్వం త్వరలో వాటిని జారీ చేయనుంది. ఆ తర్వాత వారు దరఖాస్తు చేసుకుంటే జీరో బిల్లులు వస్తాయి. అప్పటి వరకు వీరంతా బిల్లులు చెల్లించాల్సిందే. చాలా గ్రామాల్లో లబ్ధిదారులు గృహజ్యోతికి దరఖాస్తు చేసుకున్నా ఆపరేటర్లు తప్పుగా నమోదు చేయడంతో వారు అనర్హలుగా మిగిలిపోయారు. సవరణ చేసుకున్న తర్వాత వీరంతా లబ్ధి పొందే అవకాశం ఉంది.

వివరాలు

జిల్లాలో గృహావసరాల సర్వీసులు 2,74,818

మార్చి నాటికి గృహజ్యోతి వర్తించిన సర్వీసులు 1,43,160

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు