logo

సదరం స్లాట్‌.. ఇక నిరంతరం

అర్హులైన దివ్యాంగులు తగిన ధ్రువపత్రాలతో ఎప్పుడైనా మీ-సేవా కేంద్రాల్లో సదరం స్లాట్‌ బుక్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఇప్పటి వరకు ప్రతి నెలా రెండు, నాలుగో వారాల్లో సదరం శిబిరాలను నిర్వహిస్తున్నారు.

Updated : 21 May 2024 05:52 IST

సదరం స్లాట్‌ రసీదు వెయింటింగ్‌ నంబరు 

న్యూస్‌టుడే, తాడ్వాయి: అర్హులైన దివ్యాంగులు తగిన ధ్రువపత్రాలతో ఎప్పుడైనా మీ-సేవా కేంద్రాల్లో సదరం స్లాట్‌ బుక్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఇప్పటి వరకు ప్రతి నెలా రెండు, నాలుగో వారాల్లో సదరం శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఆ తేదీలకు వారం ముందు మీ-సేవా కేంద్రాల ద్వారా టోకెన్లు జారీ చేసేవారు. ఒక్కో శిబిరానికి వంద నుంచి 120 మందికి మాత్రమే అనుమతి ఇచ్చేవారు. జిల్లా వ్యాప్తంగా స్లాట్స్‌ తక్కువ, దివ్యాంగులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో లబ్ధిదారులు నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. వారి ఇబ్బందులు గుర్తించిన ప్రభుత్వం స్టాట్లను నిరంతరం తీసుకునే వెసులుబాటు కల్పించింది. దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తికి వరుస సంఖ్యను కేటాయించి రిజర్వు(వెయిటింగ్‌)లో ఉంచుతారు. ఆ ప్రకారం టోకెన్లు జారీ చేస్తారు. చరవాణికి వచ్చిన సందేశం ఆధారంగా ఆ తేదీన శిబిరం నిర్వహించే స్థలానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చు. 

ప్పులు లేకుండా నమోదు చేయాలి : అర్హులైన వారు సదరం స్లాట్ల బుకింగ్‌ను మీ-సేవా కేంద్రాలకు వెళ్లి ఎప్పుడైనా నమోదు చేయించుకోవచ్చు. రసీదుపై నంబరు ఆధారంగా వారి స్లాట్‌ రిజర్వులో ఉంటుంది. మీ-సేవా నిర్వాహకులు లబ్ధిదారుల వివరాలు తప్పులు లేకుండా నమోదు చేయాలి. ముఖ్యంగా చరవాణి నంబర్‌ నిరంతరం పనిచేస్తూ ఉండాలి.

ప్రవీణ్‌కుమార్, ఈ-జిల్లా మేనేజర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని