logo

టెట్‌ ప్రారంభం

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)-2024 రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది. మొదటిసారిగా కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు దశల్లో జూన్‌ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

Published : 21 May 2024 05:24 IST

జిల్లాలో రెండు కేంద్రాలు

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ విద్యావిభాగం: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)-2024 రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది. మొదటిసారిగా కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు దశల్లో జూన్‌ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 21585 మంది దరఖాస్తు చేసుకున్నారు. పదోన్నతులకు టెట్‌లో అర్హత తప్పనిసరి కావడంతో ఉపాధ్యాయులు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 25 శాతం మంది ప్రభుత్వ ఉపాధ్యాయులే ఉన్నట్లు తెలుస్తోంది.

ఎక్కువ మందికి  ఇతర జిల్లాల్లోనే..

పరీక్ష నిర్వహణకు జిల్లాలో రెండు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేశారు. ఆర్మూర్‌ క్షత్రియ ఇంజినీరింగ్, నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలోని నాలెడ్జ్‌ పార్క్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను ఎంపిక చేశారు. ఉమ్మడి జిల్లావాసులకు ఎక్కువగా ఇతర జిల్లాల్లోనే పరీక్ష కేంద్రాలు కేటాయించారు. మన వద్ద సరైన వసతులున్న పాఠశాలలు, కళాశాలలు లేకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నారు.

మొదటిరోజు  86 మంది గైర్హాజరు

ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులను నిర్దేశిత సమయానికి గంటన్నర ముందుగానే కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. ఉదయం 8.45 తర్వాత, మధ్యాహ్నం 1.45 తర్వాత ఎవరినీ అనుమతించడం లేదు. ఆర్మూర్‌ క్షత్రియ కళాశాలలో ఉదయం 50 మందికి 16 మంది మాత్రమే హాజరుకాగా, మధ్యాహ్నం 50 మందికి 45 మంది హాజరయ్యారు. నాలెడ్జ్‌ పార్క్‌ పాఠశాలలో ఉదయం 120 మందికి 82, మధ్యాహ్నం 120 మందికి 111 మంది హాజరైనట్లు డీఈవో దుర్గాప్రసాద్‌ తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని