logo

స్ట్రాంగ్‌రూంల పరిశీలన

సంగారెడ్డి జిల్లాలోని గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం లెక్కింపు కేంద్రంలోని స్ట్రాంగ్‌రూంలను జిల్లా ఎన్నికల అధికారి జితేశ్‌ వి పాటిల్‌ సోమవారం సందర్శించారు.

Updated : 28 May 2024 04:28 IST

లెక్కింపు కేంద్రం వద్ద అధికారులు, సిబ్బందితో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి జితేశ్‌ వి పాటిల్‌ 

కామారెడ్డి కలెక్టరేట్, న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లాలోని గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం లెక్కింపు కేంద్రంలోని స్ట్రాంగ్‌రూంలను జిల్లా ఎన్నికల అధికారి జితేశ్‌ వి పాటిల్‌ సోమవారం సందర్శించారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను అక్కడ భద్రపర్చారు. దీంతో అక్కడికి వెళ్లిన పాలనాధికారి సీసీ కెమెరాల పనితీరు, మూడంచెల భద్రత వ్యవస్థను పరిశీలించారు. అనంతరం అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని