logo

రూ.129 కోట్ల మద్యం తాగేసిండ్రు!

ఈ వేసవిలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. సర్కారుకు మెండుగా ఆదాయం సమకూరుతోంది. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో 151 వైన్స్‌లు, 29 బార్లు ఉన్నాయి

Updated : 28 May 2024 05:59 IST

న్యూస్‌టుడే, మాక్లూర్‌ : ఈ వేసవిలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. సర్కారుకు మెండుగా ఆదాయం సమకూరుతోంది. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో 151 వైన్స్‌లు, 29 బార్లు ఉన్నాయి. వాటికి మాక్లూర్‌ మండలం మాదాపూర్‌లోని ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌ (ఐఎంఎల్‌) డిపో నుంచి మద్యం సరఫరా అవుతోంది. రోజూ రూ.5కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోతుంది. ముఖ్యంగా బీర్లకు మంచి గిరాకీ ఏర్పడింది. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేకున్నా.. నిత్యం రూ.1.50కోట్ల విలువైన బీర్లు విక్రయిస్తున్నారు. మద్యం దుకాణాలకు ఎక్సైజ్‌ అధికారులు రేషన్‌ పద్ధతిలో పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి మే 27వ తేదీ నాటికి రూ.129 కోట్ల విలువైన బీర్లు తాగేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని