logo

ప్రశ్నపత్రంలో గందరగోళం

: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం ఉదయం జరిగిన డిగ్రీ రెగ్యులర్‌ సెమిస్టర్‌ పరీక్ష పత్రంలో కొంత గందరగోళం నెలకొన్నట్లు విద్యార్థులు వాపోయారు.

Published : 28 May 2024 02:38 IST

తెవివి క్యాంపస్‌: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం ఉదయం జరిగిన డిగ్రీ రెగ్యులర్‌ సెమిస్టర్‌ పరీక్ష పత్రంలో కొంత గందరగోళం నెలకొన్నట్లు విద్యార్థులు వాపోయారు. యూనివర్సిటీ పరీక్షల విభాగం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా పంపిన ప్రశ్నపత్రాలను కేంద్రాల్లో విద్యార్థులు ఇవ్వగా.. కొన్ని ప్రశ్నలకు స్పేస్‌(గ్యాప్‌) లేకుండా రావడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. విషయాన్ని యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మరో ప్రశ్నపత్రం ఆన్‌లైన్లో పంపించడం.. ఆ పత్రాలను పరీక్ష కేంద్రాల్లో జిరాక్సులు తీసి విద్యార్థులకు ఇవ్వడంతో పరీక్ష కొంత ఆలస్యంగా ప్రారంభమైనట్లు విద్యార్థులు, పరీక్ష కేంద్రాల నిర్వాహకుల ద్వారా తెలిసింది. ఈ విషయాన్ని వర్సిటీలోని ఓ అధికారిని సంప్రదించగా ప్రశ్నపత్రంలో స్పేస్‌ కారణంగా మరో ప్రశ్నపత్రం ఇవ్వడంలో కొంత ఆలస్యమైన విషయం వాస్తవమేనని పేర్కొన్నారు. అలాగే శనివారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో హిందీ అయిదో సెమిస్టర్‌ పరీక్ష పత్రానికి బదులు బదులు ఆరో సెమిస్టర్‌ అని ముద్రించి వచ్చినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని