logo

డిగ్రీ పరీక్షల్లో ఆరుగురి డిబార్‌

: తెవివి పరిధిలో సోమవారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో ధర్పల్లి, మోర్తాడ్‌ ప్రభుత్వ కళాశాల కేంద్రాల్లో కలిపి ఇద్దరు, ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో నలుగురు విద్యార్థులు చూచిరాతకు పాల్పడుతూ పట్టుబడి డిబార్‌ అయినట్లు వర్సిటీ అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య చంద్రశేఖర్‌ తెలిపారు.

Published : 28 May 2024 02:47 IST

కామారెడ్డిలోని పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న ఆచార్య చంద్రశేఖర్‌ 

తెవివి క్యాంపస్, న్యూస్‌టుడే: తెవివి పరిధిలో సోమవారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో ధర్పల్లి, మోర్తాడ్‌ ప్రభుత్వ కళాశాల కేంద్రాల్లో కలిపి ఇద్దరు, ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో నలుగురు విద్యార్థులు చూచిరాతకు పాల్పడుతూ పట్టుబడి డిబార్‌ అయినట్లు వర్సిటీ అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య చంద్రశేఖర్‌ తెలిపారు. ఉదయం జరిగిన నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలకు 8,193కి 7,714 మంది, మధ్యాహ్నం అయిదో సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలకు 8,484కి 7,937 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.

నేడు ధ్రువపత్రాల పరిశీలన

తెవివి క్యాంపస్, న్యూస్‌టుడే: డిగ్రీ ప్రవేశాల(2024-25) కోసం ‘దోస్త్‌’లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు తెవివి పరిపాలన భవనంలోని అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ విభాగంలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని సమన్వయకర్త సంపత్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం దివ్యాంగులు, బుధవారం ఎన్‌సీసీ విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తారని పేర్కొన్నారు. సందేహాలకు 9848904793, 8374406322 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని