logo

మిగిలింది ఎనిమిది రోజులే..

పోలీసు కానిస్టేబుల్‌, ఎస్సై అభ్యర్థుల శారీరక సామర్థ్య పరీక్షలకు షెడ్యూల్‌ ప్రకటనతో అభ్యర్థులు పోటాపోటీగా కసరత్తు చేస్తున్నారు.

Published : 30 Nov 2022 06:32 IST

మైదానాన్ని సిద్ధం చేస్తున్న పోలీసులు
న్యూస్‌టుడే, ఇందూరు సిటీ

లాంగ్‌జంప్‌ సాధన కోసం అభ్యర్థులు తాత్కాలికంగా చేసుకున్న ఏర్పాట్లు

పోలీసు కానిస్టేబుల్‌, ఎస్సై అభ్యర్థుల శారీరక సామర్థ్య పరీక్షలకు షెడ్యూల్‌ ప్రకటనతో అభ్యర్థులు పోటాపోటీగా కసరత్తు చేస్తున్నారు. నిజామాబాద్‌లోని నాగారం రాజారాం స్టేడియంలో డిసెంబరు 8 నుంచి పరీక్షలు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యం వందలాది మంది యువత ఇక్కడ సాధన చేస్తున్నారు. అయితే ఈ మైదానంలో అరకొర వసతులు ఉన్నాయి. ట్రాక్‌ నిర్మాణంతో పాటు తాత్కాలిక మూత్రశాలలకు మరమ్మతులు, షామియానాలు ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ఒకటో తేదీ నుంచి మైదానాన్ని పోలీసులు అధీనంలోకి తీసుకోనున్నారు.

విధుల్లో ఉభయ జిల్లాల పోలీసులు

నియామక మండలి నిబంధనలు అనుసరించి ప్రతి విభాగం వద్ద పోలీసు అధికారులు పరిశీలనకు ఉండనున్నారు. నిజామాబాద్‌ కమిషనరేట్‌, కామారెడ్డి పోలీసులు ఈ సామర్థ్య పరీక్షల విధుల్లో పాల్గొననున్నారు.

ఉదయం 5 గంటలకే..

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన అభ్యర్థులు రానున్నారు. దాదాపు డిసెంబరు నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తికానుంది. అభ్యర్థులు అడ్మిట్‌ కార్డులను విధిగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సీపీ నాగరాజు ఒక ప్రకటనలో సూచించారు. పోలీసు నియామకమండలి వెబ్‌సైట్‌ నుంచి డిసెంబరు 3లోగా పొందాలన్నారు. షెడ్యూల్‌ ప్రకారం సూచించిన రోజు ఉదయం 5 గంటలకు రాజారాం స్టేడియానికి చేరుకోవాల్సి ఉంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని