తెరపైకి మరో మండలం
కొత్త మండలాల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఇటీవలే కోటగిరి మండలంలోని పొతంగల్‌ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది.
హన్మాజిపేట్ ఏర్పాటుకు రంగం సిద్ధం!
న్యూస్‌టుడే, బాన్సువాడ
ప్రధాన కూడలి
కొత్త మండలాల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఇటీవలే కోటగిరి మండలంలోని పొతంగల్‌ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. తాజాగా బాన్సువాడలో హన్మాజిపేట్ తెరపైకి వచ్చింది. స్థానికుల విజ్ఞప్తి మేరకు సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు. గ్రామాల తీర్మాన కాపీలు, జనాభా ఇతర వివరాలను పంపించాలని ఆయా జిల్లాల పాలనాధికారుల నుంచి స్థానిక రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు అందాయి. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
11 గ్రామాలతో..
బాన్సువాడ మండలంలో మొత్తం 25 పంచాయతీలు. మండలకేంద్రానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హన్మాజిపేట్‌ను ఏర్పాటు చేయాలని గతంలో ఆలోచన చేసినా.. ఆయా గ్రామాల సహకారం లేకపోవడంతో అడుగు ముందుకు పడలేదు. ఇటీవల పొతంగల్ ఏర్పాటుతో మరోసారి ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలిసింది.
ఈ గ్రామాలతోనే..
కొత్త మండలంలో బాన్సువాడ నుంచి హన్మాజిపేట్‌తోపాటు కోనాపూర్, ఖాద్లాపూర్, సంగోజిపేట్, సోమ్లనాయక్‌తండా, పులిగుచ్చతండా, వర్ని మండలం నుంచి పైడిమల్, చింతల్‌పేట్, చిలుకతండా, గోకుల్‌దాస్‌తండా, సిద్ధాపూర్‌తండాను చేర్చాలని భావిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపనున్నారు.
మొత్తం ఐదు..
బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటికే ఐదు కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. వర్నిలో మోస్రా, చందూర్, రుద్రూర్, కోటగిరిలో పొతంగల్, బీర్కూరులో నస్రుల్లాబాద్ నూతన మండలాలుగా కొలువుదీరాయి. హన్మాజిపేట్ ఏర్పాటైతే.. పాత బాన్సువాడ, బీర్కూరు, కోటగిరి, వర్నితో కలిపి మండలాల సంఖ్య 10కి చేరనుంది.
వివరాలు అడిగారు
గంగాధర్, తహసీల్దార్, బాన్సువాడ
హన్మాజిపేట్‌తోపాటు మరో ఐదు గ్రామాల వివరాలను కలెక్టర్ అడిగారు. తీర్మాన కాపీలు పంపిస్తున్నాం. కొత్త మండలం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానికంగా అభివృద్ధి
- బోనాల సుభాష్, సర్పంచి, హన్మాజిపేట్
హన్మాజిపేట్ మండలంగా ఏర్పాటైతే ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇందుకు సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కృషి చేస్తారని భావిస్తున్నాం. ఇప్పటికే తీర్మానం చేసి అధికారులకు ఇచ్చాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Movies News
Shah Rukh Khan: షారుక్‌ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!
-
World News
Rishi Sunak: సునాక్ మీరు బిలియనీరా..? బ్రిటన్ ప్రధాని సమాధానమిదే..