logo

ట్రేడ్‌ లైసెన్సు బాధ్యతల నుంచి తొలగింపు

వ్యాపారులు ట్రేడ్‌ లైసెన్సు తీసుకునే విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పారిశుద్ధ్య పర్యవేక్షకుడు షాదుల్లాను ఆ విభాగం నుంచి తొలగించారు.

Published : 03 Feb 2023 06:01 IST

నిజామాబాద్‌ నగరం : వ్యాపారులు ట్రేడ్‌ లైసెన్సు తీసుకునే విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పారిశుద్ధ్య పర్యవేక్షకుడు షాదుల్లాను ఆ విభాగం నుంచి తొలగించారు. నగరంలోని ఖలీల్‌వాడీ ఏరియాలో వ్యాపారుల నుంచి ఇబ్బడిముబ్బడిగా డబ్బులు వసూలు చేశారు. ‘ఈనాడు’లో దీనిపై పలుమార్లు కథనాలు వచ్చాయి. అధికారులు మందలించినా మార్పు రాకపోవడంలో చర్యలకు ఉపక్రమించారు. ఇకపై ట్రేడ్‌ లైసెన్సు ఫీజు వసూలు చేయకుండా కార్యాలయంలోనే విధులు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారి సాజిద్‌అలీ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


ఇద్దరి జోన్ల మార్పులు

నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేసే ఇద్దరు పారిశుద్ధ్య పర్యవేక్షకుల జోన్లను అంతర్గతంగా మార్చారు. జోన్‌-2లో పనిచేస్తున్న ప్రశాంత్‌ను జోన్‌-4బీకి, అక్కడ విధులు నిర్వహిస్తున్న నటరాజ్‌గౌడ్‌ను జోన్‌-2కు కేటాయించారు. ఈ మేరకు వారు గురువారం విధుల్లో చేరారు. మిగతా నాలుగు జోన్ల పారిశుద్ధ్య పర్యవేక్షకులను మార్చాల్సి ఉండగా.. బల్దియాలో పనిచేసే ఒకరు దీన్ని అడ్డుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని