logo

Odisha: భారీగా గంజాయి ప్టటివేత

కేరళ, రాజస్థాన్‌కు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను జయపురం అబ్కారి శాఖ పట్టుకుంది.

Published : 27 May 2024 16:13 IST

నవరంగపూర్‌: కేరళ, రాజస్థాన్‌కు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను జయపురం అబ్కారి శాఖ పట్టుకుంది. ఓఇసీ నీలాద్రి బిహారి మిశ్రా తెలిపిన వివరాలు ప్రకారం.. 326 జాతీయ రహదారిపై పాత్రేపుట్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా ఒక ఆటోలో గంజాయి తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కేరళ రాష్ట్రం కాలికట్ ప్రాంతానికి చెందిన ఫసలుదిల్ (32), అర్షద్ హుసేన్ (25) ఆలిసాన్ మైయూదిన్ (19) తో పాటు కోరాపుట్ సమితి కెరంగ పంచాయతీ అభినాగ్ (ఆటో చోదకుడు) నిగా గుర్తించి ఆటో సీజ్ చేసి వారిని ఆరెస్ట్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని