logo

‘పది’లో బాలికలదేే హవా

ఈ ఏడాది రాష్ట్ర మాధ్యమిక విద్యాబోర్దు నిర్వహించిన పది పరీక్షా ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. 96.07 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

Published : 27 May 2024 03:55 IST

మొదటిస్థానంలో ఖుర్దా

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఈ ఏడాది రాష్ట్ర మాధ్యమిక విద్యాబోర్దు నిర్వహించిన పది పరీక్షా ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. 96.07 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా అమ్మాయిలదే పైచేయి. గతంలో కటక్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులు విలేకరుల సమావేశం నిర్వహించి ఫలితాల పుస్తకాలు విడుదల చేసేవారు. ఈసారి దీనికి భిన్నంగా ఫలితాలు ప్రెస్‌ రిలీజ్‌ చేశారు. తర్వాత వెబ్‌సైట్, ఎస్‌ఎంఎస్‌ మాధ్యమాల్లో ప్రకటించారు.

  • ఈ ఏడాది 5,41,061 మంది పరీక్షలు రాశారు. 5,30,153 మంది ఉత్తీర్ణులయ్యారు.
  • బాలికల ఉత్తీర్ణత 96.73 శాతం కాగా, బాలురది 95.39గా నమోదైంది.
  • ఫలితాల్లో 97.98 శాతం ఫలితాలలో ఖుర్దా జిల్లా అగ్రగామిగా నిలవగా, 93.91 శాతం ఫలితాలతో నువాపడ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 
  • 2644 ఉన్నత పాఠశాలలు నూరు శాతం ఫలితాలు సాధించాయి.
  • విద్యాబోర్డు అధ్యక్షుడు శ్రీకాంత తరై విలేకరులతో మాట్లాడుతూ... ఫలితాలపై ఏమైనా అనుమానాలుంటే ఈ నెల 29 నుంచి జూన్‌ 12 వరకు రీ చెకింగ్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సప్లమెంటరీ పరీక్షలు రాయాలనుకునే బాలబాలికలు జూన్‌ 10 నుంచి దరఖాస్తులు చేయాలన్నారు. పది ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని, మూల్యాంకనలో ఎలాంటి లోపాలు లేవని పేర్కొన్నారు.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని