logo

ఖుర్దా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద భాజపా ధర్నా

ఖుర్దా అసెంబ్లీ నియోజకవర్గ భాజపా అభ్యర్థి ప్రశాంతజగ్‌దేవ్‌ను ఉద్దేశపూర్వకంగా బిజద పెద్దలు ఇరికించి అరెస్టు చేయించి కారాగారానికి తరలించారని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ భాజపా కార్యకర్తలు సోమవారం ఖుర్దా సబ్‌ కలెక్టరు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

Published : 28 May 2024 06:03 IST

ఖుర్దా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా 

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఖుర్దా అసెంబ్లీ నియోజకవర్గ భాజపా అభ్యర్థి ప్రశాంతజగ్‌దేవ్‌ను ఉద్దేశపూర్వకంగా బిజద పెద్దలు ఇరికించి అరెస్టు చేయించి కారాగారానికి తరలించారని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ భాజపా కార్యకర్తలు సోమవారం ఖుర్దా సబ్‌ కలెక్టరు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. 25న జరిగిన మూడో విడత పోలింగ్‌లో బెలగడ కేంద్రానికి తన హక్కు వినియోగించుకోవడానికి వెళ్లిన జగ్‌దేవ్‌ ఈవీఎంను తోసేశారన్న ఆరోపణ వాస్తవం కాదని వారు నినాదాలు చేశారు. సీసీటీవీ పుటేజీ పరిశీలించకుండా ఏకపక్షంగా అరెస్టు చేసి జైలుకు తరలించడం కక్షపూరిత చర్యగా పేర్కొన్నారు. దీనిపై ఖుర్దా ఎస్పీ అవినాష్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ డ్రిసైడింగ్‌ అధికారి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నామని, పోలింగ్‌ ప్రక్రియ పూర్తయిన తరువాత సీసీటీవీ పుటేజ్‌ పరిశీలిస్తామన్నారు. మరోవైపు భాజపా నేత, బ్రహ్మపుర లోక్‌సభ అభ్యర్థి ప్రదీప్‌కుమార్‌ పాణిగ్రహి సోమవారం భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఓటమి భయంతో బిజద నేతలు హింసను ప్రేరేపిస్తున్నారని, తమకు విధేయులుగా ఉన్న పోలీసు అధికారులతో భాజపా నేతలపై కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. హింజలిలో నవీన్‌ ఓటమి ఖాయమని, జగ్‌దేవ్‌ను ఉద్దేశపూర్వకంగా జైలుకు తరలించారని, బిజద దిగజారుడు రాజకీయాలు చూస్తున్న ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెబుతారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని