logo

అవినీతికి కొమ్ము కాసిన సీఎం: ధర్మేంద్ర

అవినీతి మూలాలు పెకిలిస్తామని తొలినాళ్లలో చెప్పుకున్న నవీన్‌ అవినీతిపరులకు కొమ్ము కాసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ దుయ్యబట్టారు.

Published : 28 May 2024 06:20 IST

ఎంపీ అభ్యర్థి నబచరణ్‌ మాఝిని పరిచయం చేస్తున్న ధర్మేంద్ర 

భువనేశ్వర్, న్యూస్‌టుడే: అవినీతి మూలాలు పెకిలిస్తామని తొలినాళ్లలో చెప్పుకున్న నవీన్‌ అవినీతిపరులకు కొమ్ము కాసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ దుయ్యబట్టారు. సోమవారం మయూర్‌భంజ్‌ జిల్లా కేంద్రం బరిపదలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. నవీన్‌ పాలనలో బిజద నేతలు, కొందరు అధికారులు కోట్లాది రూపాయలు సంపాదించారన్నారు. ఇసుక, ఖనిజాలు, బొగ్గు దోపిడీ అవుతున్నా రాష్ట్రంలో పట్టించుకునేవారే కరవయ్యారన్నారు. తమిళనాడు గుమస్తాకు పాలనా బాధ్యతలు అప్పగించేసిన నవీన్‌కు రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలియవన్నారు. 25 ఏళ్లలో మాతృభాష నేర్చుకోలేకపోయిన సీఎం సహాయకులు రాసిచ్చిన నాలుగు వాఖ్యాలు చెప్పే దుస్థితి దాపురించిందన్నారు. విజ్ఞతగల ఓటర్లు ఈసారి మార్పునకు శ్రీకారం చుట్టాలని, మోదీ గ్యారంటీ పట్ల నమ్మకం పెంచుకుని భాజపాకు అవకాశమివ్వాలన్నారు. ఈ జిల్లా గిరిపుత్రిక ద్రౌపదీ ముర్ముకు రాష్ట్రపతి పదవి వరించిందని, ఈ ప్రాంతానికి కేంద్రం ఎంతో చేసిందన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు