logo

Odisha: కిడ్నాప్ కేసు దర్యాప్తులో ఇద్దరు నిందితులు పరారి

కొరాపుట్ జిల్లా నందపూర్ ఠాణాలో మైనర్ బాలిక కిడ్నాప్ కేసు దర్యాప్తులో పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు నిందితులు తప్పించుకున్నారు.

Published : 27 May 2024 15:35 IST

సిమిలిగుడ: కొరాపుట్ జిల్లా నందపూర్ ఠాణాలో మైనర్ బాలిక కిడ్నాప్ కేసు దర్యాప్తులో పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు నిందితులు తప్పించుకున్నారు. ఒక నిందితుడి దాడిలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. నందపూర్ ఎస్‌డీపీవో సంబిత్ కుమార్ మజ్జి తెలిపిన  వివరాల ప్రకారం.. ఠాణా పరిధిలో కిలువా గ్రామానికి చెందిన (మైనర్ బాలిక) ఇటీవల కిడ్నాప్‌కు గురైంది. నందపూర్‌కు చెందిన రమేశ్‌ గుంట కిడ్నాప్ చేసినట్లు బాధిత కుటుంబీకులు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు జరిపి మైనర్ బాలికతో పాటు నిందితుడిని ఆదివారం సాయంత్రం పాత్ర పండి గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం దర్యాప్తు చేస్తుండగా రమేశ్‌ గోడ దూకి తప్పించుకుని పరారయ్యాడు. పోలీసులు రమేశ్‌ను వెతుకుతుండగా ఠాణాలో ఉన్న మరో నిందితుడు సయిన్ ఖాన్ అక్కడ విధుల్లో ఉండే కానిస్టేబుల్ భుసిత్ టకిరిపై తుపాకీతో దాడి జరిపి తప్పించుకున్నాడు. తీవ్ర గాయాలతో ఉన్న కానిస్టేబుల్ భుసిత్‌ను నందపూర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరారైన నిందితులకోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు