logo

రాష్ట్రానికి పీఎంఏవై-యూ అవార్డు

రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) అవార్డు లభించింది. ప్రత్యేక కేటగిరి కింద రాష్ట్రం ఉత్తమ విధానంలో చర్యలు తీసుకున్నందుకు ఈ అవార్డు దక్కింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో బుధవారం జరిగిన ఇండియన్‌ హౌసింగ్‌ కాన్‌క్లేవ్‌లో కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ అవార్డును ప్రదానం చేశారు.

Published : 21 Oct 2022 01:13 IST

రాష్ట్రం తరఫున అవార్డు అందుకుంటున్న సంగ్రామ్‌జిత్‌, దేబాశిస్‌

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) అవార్డు లభించింది. ప్రత్యేక కేటగిరి కింద రాష్ట్రం ఉత్తమ విధానంలో చర్యలు తీసుకున్నందుకు ఈ అవార్డు దక్కింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో బుధవారం జరిగిన ఇండియన్‌ హౌసింగ్‌ కాన్‌క్లేవ్‌లో కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ అవార్డును ప్రదానం చేశారు. పట్టణ అడ్మినిస్ట్రేషన్‌, జాగా మిషన్‌ సంచాలకుడు సంగ్రామ్‌జిత్‌ నాయక్‌, ఒడిశా పట్టణ గృహనిర్మాణ మిషన్‌ సంచాలకుడు దేబాశిష్‌ సింగ్‌ హాజరై రాష్ట్రం తరఫున దీనిని స్వీకరించారు.

జాగా మిషన్‌ భేష్‌...

రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు లేని పట్టణ పేదల కోసం ఒడిశా సర్కార్‌ తీసుకుంటున్న చర్యలు మార్గదర్శకంగా ఉన్నాయని కేంద్రం కొనియాడింది. జాగా మిషన్‌ పేరుతో అమలు చేస్తున్న పథకానికి సంబంధించి లబ్ధిదారులకు పీఎంఏవై-యూ కింద గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం దక్కిన విషయాన్ని కేంద్రం ప్రస్తావించింది. ఒడిశా మురికివాడల నివాసుల భూమి హక్కుచట్టం-2017 ద్వారా పట్టణ పేదల్లో నెలకొన్న అసమానతలు తగ్గించేందుకు రాష్ట్రం మంచి మార్గాన్ని ఎంచుకుందని ఈ సందర్భంగా కేంద్రం కొనియాడింది.

మౌలిక వసతుల కల్పన..

జాగా మిషన్‌ అమలుతో రాష్ట్రంలో పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణంతోపాటు అన్నిరకాల మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తున్న విషయం తెలిసిందే. జాగా మిషన్‌ ద్వారా పేదలకు నివాస భరోసా, ఇళ్లకు విద్యుత్తు, కొళాయిల ద్వారా నీటి సరఫరా, వ్యక్తిగత మరుగుదొడ్లు, మురుగునీటి కాలువలు, వీధి దీపాలు, రహదారి తదితరులు సదుపాయాలు సమకూరుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా దీని ద్వారా లబ్ధిదారులకు భూమి హక్కు దక్కుతుండడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని