logo

భిన్న సంస్కృతుల కలయిక చొయితి వేదిక

అత్యధిక శాతం ఆదివాసీలు నివసిస్తున్న రాయగడ జిల్లా భిన్న సంస్కృతుల కలయిక అని, ఆదివాసీల కళలు, సంస్కృతిని ప్రతి ఒక్కరూ కాపాడవలసి ఉందని మంత్రి జగన్నాథ సరక అన్నారు.

Published : 20 Jan 2023 00:54 IST

భువనేశ్వర్‌ కళాకారుల ఒడిస్సీ నృత్యం

రాయగడ, న్యూస్‌టుడే: అత్యధిక శాతం ఆదివాసీలు నివసిస్తున్న రాయగడ జిల్లా భిన్న సంస్కృతుల కలయిక అని, ఆదివాసీల కళలు, సంస్కృతిని ప్రతి ఒక్కరూ కాపాడవలసి ఉందని మంత్రి జగన్నాథ సరక అన్నారు. బుధవారం రాత్రి జీసీడీ క్రీడామైదానంలో ప్రారంభమైన జిల్లా సాంస్కృతిక ఉత్సవం చొయితి తొలిరోజు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పాలనాధికారి స్వాధాదేవ్‌ సింగ్‌ మాట్లాడుతూ జిల్లా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, భారీ పరిశ్రమలు జిల్లాలో ఉన్నాయన్నారు. రైతులు, ఆదివాసీల ఉన్నతికి కృషి చేస్తున్నట్లు వివరించారు. మిల్లెట్‌ మిషన్‌ మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. చొయితి వేదిక కళాకారులను ప్రోత్సహించేందుకే అని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ సప్తగిరి ఉలక, బిజు ఆరోగ్య పథకం రాష్ట్ర సలహాదారు సుధీర్‌దాస్‌, ఎస్పీ వివేకానంద శర్మ, జిల్లా పరిషత్‌, పురపాలక సంస్థ, సమితుల అధ్యక్షులు పాల్గొన్నారు. అనంతరం అతిథులు చొయితి వార్షిక సంచిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక కవులు, అతిథులను సత్కరించారు.

చొయితి సంచికను ఆవిష్కరిస్తున్న సరక, సప్తగిరి, స్వాధాదేవ్‌ తదితరులు

అబ్బుర పరిచిన సాంస్కృతిక కార్యక్రమాలు

దేశవిదేశాల్లో కీర్తి గడించిన ఒడిస్సీ నృత్యంతో మొదట భువనేశ్వర్‌ కళాకారులు అలరించారు. అనంతరం లంజియా సవర, డొంగిరియా, కొంద కళాకారుల ఆదివాసీ నృత్యాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు అర్ధరాత్రి ప్రేక్షకులు తిలకించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని