logo

గజలక్ష్మీ అవతారంలో దర్శనం

గంజాం జిల్లాలోని సుప్రసిద్ధ తరాతరిణి శక్తిపీఠంలో రెండో మంగళవారం చైత్రయాత్రకు భక్తులు పోటెత్తారు. వేకువన విశేష పూజల అనంతరం దర్శనానికి భక్తుల్ని అనుమతించారు.

Published : 03 Apr 2024 05:40 IST

దేవతామూర్తులకు అలంకరణ

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లాలోని సుప్రసిద్ధ తరాతరిణి శక్తిపీఠంలో రెండో మంగళవారం చైత్రయాత్రకు భక్తులు పోటెత్తారు. వేకువన విశేష పూజల అనంతరం దర్శనానికి భక్తుల్ని అనుమతించారు. దేవతామూర్తుల్ని గజలక్ష్మీ అవతారంతో అలంకరించామని శక్తిపీఠం కార్యనిర్వహణాధికారి (ఈఓ) తిరుమల కుమార్‌ రెడ్డి ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. మధ్యాహ్నం నాటికి లక్ష మందికిపైగా భక్తులు తల్లిని దర్శించుకున్నారని ఆయన పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కింద నుంచి కొండపైకి పదిహేను బస్సులను యంత్రాంగం ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సత్యబ్రత సాహు దేవతామూర్తుల్ని దర్శించుకున్నారని రెడ్డి పేర్కొన్నారు.

తరాతరిణి దర్శనానికి వరుసలో భక్తులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని