logo

కాంగ్రెస్‌ తొలి జాబితా

ఎట్టకేలకు కాంగ్రెస్‌ అధిష్ఠానం మంగళవారం 8 లోక్‌సభ, 49 అసెంబ్లీ స్థానాల తొలిజాబితా విడుదల చేసింది. సిటింగ్‌ నేతల కుమారులు, కుమార్తెలు, అల్లుళ్లకు అవకాశమిచ్చింది.

Updated : 03 Apr 2024 05:42 IST

8 లోక్‌సభ, 49 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఎట్టకేలకు కాంగ్రెస్‌ అధిష్ఠానం మంగళవారం 8 లోక్‌సభ, 49 అసెంబ్లీ స్థానాల తొలిజాబితా విడుదల చేసింది. సిటింగ్‌ నేతల కుమారులు, కుమార్తెలు, అల్లుళ్లకు అవకాశమిచ్చింది.

లోక్‌సభ అభ్యర్థులు

కొరాపుట్‌ స్థానానికి సిటింగ్‌ ఎంపీ సప్తగిరి ఉలక అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. బ్రహ్మపురకు రశ్మిరంజన్‌ పట్నాయక్‌, నవరంగపూర్‌కు భుజబల్‌ మాఝి, బొలంగీర్‌కు మనోజ్‌మిశ్ర, బరగఢ్‌కు సంజయ్‌ ఖోయ్‌, సుందర్‌గఢ్‌కు జనార్థన్‌ దెహురి, కలహండికి ద్రౌపదీ మాఝి, కొంధమాల్‌కు అమీర్‌ చంద్రనాయక్‌ అభ్యర్థులయ్యారు.

నువాపడ నుంచి శరత్‌ పట్నాయక్‌

పీసీసీ అధ్యక్షుడు శరత్‌ పట్నాయక్‌ నువాపడ అసెంబ్లీ అభ్యర్థి కాగా, కాంగ్రెస్‌ సభాపక్షం కార్యదర్శి తారాప్రసాద్‌ వాహినీపతి జయపురం అభ్యర్థి అయ్యారు. సీఎల్పీ నేత నర్సింగమిశ్ర కుమారుడు సమరేంద్ర మిశ్ర బొలంగీర్‌ బరిలో నిలిచారు. ఇతర స్థానాల నుంచి పోటీ చేసేవారి వివరాలు ఇవీ... టంకధర్‌ సాహు (పదంపూర్‌), కిశోర్‌ దఫాదర్‌ (బిజెపూర్‌), నిపన్‌కుమార్‌ దాస్‌ (బరగఢ్‌), బ్రహ్మ మహాకుడ్‌ (భట్లీ), కిశోర్‌చంద్ర పటేల్‌ (బ్రజరాజనగర్‌), ప్రబోద్‌ తిర్కీ (తల్సర), సుధారాణి రాడియా (సుందర్‌గఢ్‌), బీరరాజపూర్‌ స్థానం వామపక్షాలు లేదా జేఎంఎం అభ్యర్థికి, గోపాల్‌దాస్‌ (రఘునాథ్‌పల్లి), బీరేంద్రనాథ్‌ పట్నాయక్‌ (రవుర్కెలా), సి.ఎస్‌.రాజన్‌ ఎక్కా (రాజ్‌గంగపూర్‌), బోణై సీటు వామపక్షాలకు, ఓం ప్రకాష్‌ కుంభార్‌ (లోయిసింగ), అనీల్‌ మెహర్‌ (పాట్నాగఢ్‌) సంతోష్‌సింగ్‌ సలూజా (కంటాభంజి), సన్‌రాజ్‌గోండా (ఉమ్మర్‌కోట్‌), హిరబతి గొండ (ఝురిగాం), దిలీప్‌ ప్రధాని (నవరంగపూర్‌), లిపికా మాఝి (డాబుగాం), బలభద్ర మాఝి (లంజిగఢ్‌), తలేశ్వర్‌ నాయక్‌ (జనాగఢ్‌), రశ్మిరేఖ రౌత్‌ (ధర్మగఢ్‌) సాగర్‌ చరణ్‌ దాస్‌ (భవానీపట్నా), భక్తచరణదాస్‌ (నర్లా), సురదా ప్రధాన్‌ (బలిగుడ), ప్రఫుల్ల చంద్రప్రధాన్‌ (జి.ఉదయగిరి), ప్రతివా కన్హర్‌ (ఫుల్భాణి) మనోజ్‌కుమార్‌ ఆచార్య (కంటామాల్‌), నబకిశోర్‌ మిశ్ర (బౌద్ధ్‌), ప్రశాంతకుమార్‌ బిశోయి (భంజనగర్‌), అగస్తిబరడ (పొలసర), చిరంజీవి బిశోయి (కవిసూర్యనగర్‌), హరికృష్ణరథ్‌ (సురడ), రమేష్‌ చంద్రజెనా (సన్నోఖెముండి), రవీంద్రనాథ్‌ ధ్యానసామంత్రాయ్‌ (చికిటి), దాశరథి గమాంగ్‌ (మోహన), బిజయ్‌కుమార్‌ పట్నాయక్‌ (పర్లాఖెముండి, సత్యజిత్‌ గమాంగ్‌ (గుణుపురం), నీలమాధవ హికాక (బిసంకటక్‌), కడ్రక్‌ అప్పలస్వామి (రాయగడ), పబిత్ర సౌంట (లక్ష్మీపూర్‌), అనమా దియాన్‌ (కోట్పాడ్‌), కృష్ణచంద్ర కులదీప్‌ (కొరాపుట్‌), రామచంద్రకడం (పొట్టంగి), మాలమాఢి (మల్కాన్‌గిరి), మంగుఖిలా (చిత్రకొండ), త్వరలో రెండో (పూర్తి) జాబితా విడుదలవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని