logo

అసెంబ్లీకి 112 మందితో భాజపా అభ్యర్థుల ఖరారు

భాజపా నాయకత్వం మంగళవారం 112 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటించింది. పార్టీకి చెందిన 17 మంది ప్రస్తుత ఎమ్మెల్యేలను మళ్లీ బరిలోకి దించింది. 8 మంది మహిళలకు మాత్రమే అవకాశమిచ్చిన ఆ పార్టీ వలస వచ్చిన నేతలందరినీ అభ్యర్థులుగా చేసింది.

Published : 03 Apr 2024 05:44 IST

సిటింగ్‌ ఎమ్మెల్యేలు, వలస నేతలకు టిక్కెట్లు
8 మంది మహిళలకు అవకాశం

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: భాజపా నాయకత్వం మంగళవారం 112 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటించింది. పార్టీకి చెందిన 17 మంది ప్రస్తుత ఎమ్మెల్యేలను మళ్లీ బరిలోకి దించింది. 8 మంది మహిళలకు మాత్రమే అవకాశమిచ్చిన ఆ పార్టీ వలస వచ్చిన నేతలందరినీ అభ్యర్థులుగా చేసింది. భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్‌సామల్‌ బాలేశ్వర్‌ జిల్లా చాంద్‌బలి నుంచి పోటీ చేయనున్నారు. విపక్షనేత జయనారాయణ మిశ్ర, సభాపక్షం కార్యదర్శి మోహన్‌ మాఝి కేంఝర్‌, బరగఢ్‌ల నుంచి, ప్రస్తుత ఎంపీ సురేష్‌ పూజారి ఝార్సుగుడ జిల్లా బ్రజరాజనగర్‌ నుంచి బరిలో దిగనున్నారు. బిజద అధినేత, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పోటీ చేస్తున్న గంజాం జిల్లా హింజిలి శిశిర్‌ మిశ్రను భాజపా రంగంలోకి దించింది.

అభ్యర్థులు వీరే

గోవర్ధన్‌ భోయ్‌ (పదంపూర్‌), శరత్‌కుమార్‌ గర్తియా (బీజేపూర్‌), అశ్వినీ కుమార్‌ షడంగి (బరగఢ్‌), నిహర్‌ రంజన్‌ మహసింద (అతాబిర), ఇరాసిస్‌ ఆచార్య (భట్లీ), సురేష్‌ పూజారి (బ్రజరాజనగర్‌), టంకధర్‌ త్రిపాఠి (ఝార్సుగుడ), భవానీశంకర్‌ భోయ్‌ (తలనిర), కుసుంటెటె (సుందర్‌గఢ్‌), శంకర్‌ ఓరం (భీరమిత్రపూర్‌), దుర్గాచరణ్‌ తంతి (రఘునాథ్‌ పల్లి) నరిసింగ మింజ్‌ (రాజ్‌గంగపూర్‌), సెబతినాయక్‌ (బోణై), రబీంద్రనారాయణ నాయక్‌ (కుచిండ), నవురి నాయక్‌ (రెంగాలి), జయనారాయణ మిశ్ర (సంబల్‌పూర్‌), దేవేంద్ర మహాపాత్ర్‌ (రెఢాఖోల్‌), సుభాష్‌చంద్ర పాణిగ్రహి (దేవ్‌గఢ్‌), అలోక్‌ కుమార్‌ శెఠి (ఆనందపూర్‌), మోహన్‌ మాఝి (కేంఝర్‌), గణేశ్‌రామ్‌సింగ్‌ ఖుంటియా (జొషిపూర్‌), భాస్కర్‌ మడై (ఉదలా) సనాతన్‌ బిజులి (బడసాహి), ప్రకాష్‌ సోరెన్‌ (బరిపద), కృష్ణచంద్ర మహాపాత్ర్‌ (మొరడ), బిరజ ప్రధాన్‌ (జలేశ్వర్‌), మానస్‌ కుమార్‌ దత్త (బాలేశ్వర్‌), గోబంద చంద్రదాస్‌ (రెమునా), రాజేంద్రదాస్‌ (సొరో), పద్మలోచన్‌ పండా (సిములియ), శీతాంశుశేఖర్‌ మహాపాత్ర్‌ (భద్రక్‌), సూర్యవంశీ సూరజ్‌ (ధాంనగర్‌), మన్మోహన్‌ సామల్‌ (చాంద్‌బలి), బబితా మల్లిక్‌ (బింఝారపూర్‌), అమర్‌కుమార్‌ నాయక్‌ (బొడొబొణా) స్మృతిరేఖా పహి (ధర్మశాల), గౌతం రాయ్‌ (జాజ్‌పూర్‌), ఆకాష్‌ దాస్‌ నాయక్‌ (కొరై), ప్రదీప్‌బల సామంత (సుకింద), కృష్ణచంద్రపాత్ర్‌ (ఢెంకనాల్‌), శతృఘ్నజెనా (కామాక్ష్యనగర్‌) బిభూతి భూషణ్‌ ప్రధాన్‌ (పరజంగ), అశోక్‌ మహంతి (పలలహడ), కాళింది చరణ్‌ సామల్‌ (తాల్చేర్‌), ప్రతాప్‌చంద్ర ప్రధాన్‌ (అనుగుల్‌), అగస్తి బెహరా (ఛెండిపద), సంజీవ్‌ సాహు (అఠమల్లిక్‌), రఘునాథ జగదాల (బీరమహరాజపూర్‌), ప్రమోధ్‌ మహాపాత్ర్‌ (సోన్‌పూర్‌), ముఖేష్‌ మహాలింగ (లోయిసింగ), కనకవర్ధన్‌ సింగ్‌దేవ్‌ (పాట్నాగఢ్‌), గోపాల్‌జీ పాణిగ్రహి (బొలంగీర్‌) నవీన్‌ జైన్‌ (టిట్లాగఢ్‌), లక్ష్మణ్‌ బాగ్‌ (కంటాబంజి), అభినందన్‌ కుమార్‌ పండా (నువాపడ), హితేష్‌కుమార్‌ భగతి (ఖరియార్‌), నిత్యానంద గొండో (ఉమర్‌కోట్‌), గౌరీశంకర్‌ మాఝి (నవరంగపూర్‌), రమేషచంద్ర మాఝి (లంజిగఢ్‌), మనోజ్‌కుమార్‌ మెహర్‌ (జునాగఢ్‌), సుధీర్‌ పట్టజోషి (ధర్మగఢ్‌), ప్రదీప్తకుమార్‌నాయక్‌ (భవానీపట్నా), అనిరుద్ధప్రధాన్‌ (నర్లా), కల్పానా కుమారి కన్హర్‌ (బలిగుడ), మానగోబందప్రధాన్‌ (జి.ఉదయగిరి), ఉమాచరణ్‌ మల్లిక్‌ (ఫుల్బాణి), కన్హాయి చరణ్‌ దంగ (కంటమాల్‌), సరోజ్‌ ప్రధాన్‌ (బౌద్ధ్‌), సంబిత్‌ త్రిపాఠి (బడంబ), తుషార్‌కాంగి చక్రవర్తి (బంకీ), అభయకుమార్‌ బారిక్‌ (అఠాగఢ్‌), నయన్‌కుమార్‌ మహంతి (చౌద్వార్‌-కటక్‌), ఛబిమల్లిక్‌ (నియాలి), ప్రకాష్‌ చంద్రశెఠి (కటక్‌-సదర్‌), సుమంత్‌ కుమార్‌ ఘడై (మహంగ), తేజేశ్వరి పరిడ (పట్కురా), కృష్ణచంద్ర పండా (ఒళి), దుర్గాప్రసాద్‌ నాయక్‌ (మహాకాళపడ), సంపద్‌కుమార్‌ స్వయిన్‌ (పరదీప్‌), రాజ్‌కిశోర్‌ బెహరా (తిర్తోల్‌), పార్వతి పరిడ (నిమపడ), జయంత షడంగి (పూరీ), ఉపాసనా మహాపాత్ర్‌ (బ్రహ్మగిరి), ఓంప్రకాష్‌ మిశ్ర (సత్యబాది), అశ్రిత్‌కుమార్‌ పట్నాయక్‌ (పిపిలి), అరవింద ఢాలి (జయదేవ్‌), జగన్నాథ్‌ ప్రధాన్‌ (భువనేశ్వర్‌-మధ్య) ప్రియదర్శి మిశ్ర (భువనేశ్వర్‌ - ఉత్తర), బాబూసింగ్‌ (భువనేశ్వర్‌-ఏకామ్ర), బిశ్వరంజన్‌ బొడోజెనా (జట్నీ), పృథ్వీరాజ్‌ హరిచందన్‌ (చిలికా), తాపస్‌ రంజన్‌ మిశ్ర (రణపూర్‌), దుష్మంత స్వయిన్‌ (ఖండపడ), రాఘవ్‌ మల్లిక్‌ (దసపల్లా), ప్రత్యూష రాజేశ్వరి సింగ్‌ (నయాగఢ్‌), ప్రద్యుమ్న తోమార్‌ నాయక్‌ (భంజనగర్‌), గోకులనంద మల్లిక్‌ (పొలసర), ప్రతాప్‌ చంద్రనాయక్‌ (కవిసూర్యనగర్‌) పూర్ణచంద్రశెఠి (కళ్లికోట), కృష్ణచంద్రనాయక్‌ (ఛత్రపురం), సరోజ్‌కుమార్‌ పాఢి (అస్కా), నీలాల్‌నని బిశోయి (సురడ), శిశిర్‌ మిశ్ర (హింజలి), బిభూతి భూషణ్‌ జెనా (గోపాల్‌పూర్‌), కె.అనిల్‌కుమార్‌ (బ్రహ్మపుర), సిద్ధాంత మహాపాత్ర్‌ (దిగపొహండి), మనోరంజన్‌ ధ్యాన్‌ సమంత్రాయ్‌ (చికిటి), కె.నారాయణరావు (పర్లాఖెముండి), త్రినాథ్‌ గమాంగ్‌ (గుణుపురం), రఘురాం మచ్ఛ (కొరాపుట్), చైతన్య హంతాల్‌ (పొట్టంగి), నర్సింగ్‌ మడ్కామి (మల్కాన్‌గిరి).

త్వరలో రెండో జాబితా

147 అసెంబ్లీ స్థానాలకుగాను రెండో విడతలో మరో 35 మంది అభ్యర్థుల జాబితా త్వరలో విడుదల కానుందని భాజపా అధికార వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని