logo

Parvathipuram Manyam: ఏనుగులొస్తున్నాయి.. వేగం తగ్గించండి

మండలంలో కొన్ని రోజులుగా తిష్ఠ వేసిన ఏనుగులు పలు గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.

Updated : 25 Dec 2023 08:10 IST

అర్తాం వద్ద పట్టాలు దాటుతున్న కరిరాజులు

కొమరాడ, న్యూస్‌టుడే: మండలంలో కొన్ని రోజులుగా తిష్ఠ వేసిన ఏనుగులు పలు గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో పాతదుగ్గి నుంచి అర్తాం వద్ద రైలు పట్టాలు దాటి అటవీ ప్రాంతానికి వెళ్లాయి. ఆ సమయంలో అర్తాం, సోమినాయుడువలస గేటు కీపర్లకు, గుమడ, పార్వతీపురం స్టేషన్‌మాస్టర్లకు అటవీ శాఖ అధికారులు సమాచారం అందించారు. పార్వతీపురం (Parvathipuram Manyam), గుమడ మీదుగా వెళ్లే రైళ్ల లోకోపైలెట్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అర్తాం గేటు వద్ద రైలును అత్యంత నెమ్మదిగా నడపాలని, ట్రాకుపై ఏనుగులు ఉంటే దూరంగా నిలిపేయాలని సూచనలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని