logo

రాష్ట్రాభివృద్ధికి కూటమి గెలవాలి

రాష్ట్రంలో రాజకీయం కోడికత్తి నుంచి ప్రారంభమై గులకరాయి వరకు వచ్చింది. ఇటువంటి వారిని ఇంటికి పంపించకపోతే ప్రజలు నష్టపోతారు. ఇవన్నీ చౌకబారు రాజకీయాలు.

Updated : 17 Apr 2024 06:11 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు

గాజులరేగ సభలో మాట్లాడుతున్న అశోక్‌

 రాష్ట్రంలో రాజకీయం కోడికత్తి నుంచి ప్రారంభమై గులకరాయి వరకు వచ్చింది. ఇటువంటి వారిని ఇంటికి పంపించకపోతే ప్రజలు నష్టపోతారు. ఇవన్నీ చౌకబారు రాజకీయాలు. అయిదేళ్లకొకసారి వచ్చే ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి. 

 - అశోక్‌గజపతిరాజు  

 విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రాభివృద్ధికి కూటమిని గెలిపించాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌ గజపతిరాజు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గాజులరేగ, కణపాకలో నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడారు. ఎవరి వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. కొత్తతరానికి అవకాశం ఇవ్వాలన్నదే పార్టీ ఆలోచనని, అందుకే అదితి, కలిశెట్టి అప్పలనాయుడుకు టిక్కెట్లు ఇచ్చారన్నారు. అందుకే తాను సుదీర్ఘ రాజకీయాల నుంచి తప్పుకొన్నట్లు పేర్కొన్నారు.

 హామీలతో మభ్యపెట్టారు: అదితి

అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని కూటమి అభ్యర్థి అదితి గజపతిరాజు అన్నారు. యువతకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. అశోక్‌బంగ్లాలో మంగళవారం 11-20 వార్డు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, అనుంబంధ కమిటీలు, బూత్‌ ఇన్‌ఛార్జులతో సమీక్ష నిర్వహించారు. పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చిన జగన్‌, సీఎం అయ్యాక యువతకు ఇస్తామన్న జాబ్‌ కేలండర్‌ ఇవ్వలేదన్నారు. చంద్రబాబుతోనే యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించినవి చంద్రబాబు అమలు చేస్తారన్నారు. ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.యశస్వి, ఐవీపీ రాజు, ప్రసాదుల వరప్రసాద్‌, ఆల్తి బంగారుబాబు, కాళ్ల గౌరీశంకర్‌, కర్రోతు నర్సింగరావు, నడిపల్లి రవికుమార్‌ పాల్గొన్నారు.

350 కుటుంబాల చేరిక

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: విజయనగరంలో 350 వైకాపా కుటుంబాలు తెదేపాలో చేరాయి. అశోక్‌ బంగ్లాలో మంగళవారం నియోజకవర్గ ఇన్‌ఛార్జి అదితి విజయలక్ష్మి గజపతిరాజు సమక్షంలో వారంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  గాజులరేగ ప్రాంతానికి చెందిన మాజీ కౌన్సిలర్‌ గార సత్యనారాయణ, కటారి శ్రీనివాసులు, జి.సూర్యనారాయణ ఆధ్వర్యంలో 300 కుటుంబాలు, 26 డివిజన్‌కు చెందిన సదాయి భాస్కరరావు, ముప్పర్తి శ్రీనివాస్‌, కొప్పరపు సతీష్‌ ఆధ్వర్యంలో 25 కుటుంబాలు, పదో డివిజన్‌కు చెందిన ఆండ్ర చిన్న, కల్యాణ్‌ సింగ్‌, అదపాక తిరుపతి, రావి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మరో 25 కుటుంబాలు చేరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు