logo

బ్యాంకు లావాదేవీలపై నిఘా

ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, ఇతర వ్యయాలపై నిఘా ఉంచాలని రాష్ట్ర వ్యయ పరిశీలకురాలు నీనా నిగం ఆదేశించారు

Published : 21 Apr 2024 05:06 IST

సమీక్షలో పాల్గొన్న నీనా నిగం, కలెక్టర్‌ నాగలక్ష్మి, జేసీ, ఎస్పీ, వ్యయ పరిశీలకులు
విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, ఇతర వ్యయాలపై నిఘా ఉంచాలని రాష్ట్ర వ్యయ పరిశీలకురాలు నీనా నిగం ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులు, వ్యయ పరిశీలకులతో మాట్లాడారు. పార్టీలు గానీ, అభ్యర్థులు వ్యక్తిగతంగా గానీ అనధికారికంగా రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీలులేదన్నారు. బ్యాంకు లావాదేవీలపై దృష్టిసారించాలని కోరారు. వ్యయ పరిశీలకులు ప్రభాకర్‌ ప్రకాష్‌ రంజన్‌, ఆనంద్‌కుమార్‌, ఆకాశ దీప్‌, జేసీ కార్తీక్‌, ఎస్పీ దీపికా ఎం.పాటిల్‌, సహాయక కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్‌, డీఆర్వో అనిత తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని