logo

బోనిమద్ది ఊటబావులకు తాటిపూడి నీరు

విశాఖ మహానగరంలో ప్రజల దాహార్తి తీర్చడానికి తాటిపూడి నీటిని స్పిల్‌వే ద్వారా శనివారం విడుదల చేశారు. నెలరోజుల వ్యవధిలో రెండోసారి వదిశారు.

Published : 21 Apr 2024 05:07 IST

తాటిపూడి స్పిల్‌వే ద్వారా నీటిని విడుదల చేస్తున్న దృశ్యం
గంట్యాడ, న్యూస్‌టుడే: విశాఖ మహానగరంలో ప్రజల దాహార్తి తీర్చడానికి తాటిపూడి నీటిని స్పిల్‌వే ద్వారా శనివారం విడుదల చేశారు. నెలరోజుల వ్యవధిలో రెండోసారి వదిశారు. విశాఖ మహానగరానికి తాటిపూడి జలాశయం నుంచి ప్రతిరోజూ 11 మిలియన్‌ గ్యాలెన్ల నీరు 1968 నుంచి సరఫరా అవుతోంది. పెరిగిన జనాభా అవసరాల దృష్ట్యా గోస్తనీ పరివాహక ప్రాంతంలో బోనిమద్ది వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను సుమారు 15 ఏళ్ల కిందట నిర్మించారు. తాటిపూడి ఏటిలో పడిన మిగులు జలాలను ఊటబావుల ద్వారా రీఛార్జు చేసుకొని నీటిని సరఫరా చేస్తున్నారు. జలాశయం నుంచి నీటిని తరలించకూడదు. అయితే, పట్టణ ప్రజల దాహార్తిని దృష్టిలో ఉంచుకొని జిల్లా అధికారుల ఆదేశాలతో నీటిని స్పిల్‌వే షట్టరు ఎత్తి ఏటిలోకి విడుదల చేస్తున్నారు. సుమారు 15 రోజులపాటు నీటిని విడిచిపెట్టడం వల్ల బోని మద్ది బ్యాలెన్సింగ్‌ ఊటబావులు రీఛార్జి కాబోతున్నాయి. కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశాల మేరకు రోజుకి 50 క్యూసెక్కుల మేర నీటిని ఏటిలోకి విడిచిపెడుతున్నట్లు తాటిపూడి ప్రాజెక్టు ఏఈ వి.తమ్మినాయుడు తెలిపారు. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 290.4 అడుగులు ఉందని తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు