logo

చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం

చీపురుపల్లిలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి చంద్రబాబుకు జన్మదిన కానుకగా ఇద్దామని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు

Published : 21 Apr 2024 05:12 IST

గద్దె బాబూరావుకు మిఠాయి తినిపిస్తున్న కళా వెంకటరావు

గరివిడి, చీపురుపల్లి, రాజాం గ్రామీణం, న్యూస్‌టుడే: చీపురుపల్లిలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి చంద్రబాబుకు జన్మదిన కానుకగా ఇద్దామని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. గరివిడి పార్టీ కార్యాలయంలో కేక్‌ను కోసి, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, నియోజకవర్గ పూర్వపు ఇన్‌ఛార్జి త్రిమూర్తుల రాజుకు తినిపించారు. కిమిడి రామమల్లిక్‌ నాయుడు, రౌతు కామునాయుడు,  విసినిగిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

  • గరివిడి మండలం కాపుశంభాం, బొర్రావాని గొల్లలపాలెం గ్రామాల్లో చెరువు పనుల వద్ద వేతనదారులకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామమల్లిక్‌ నాయుడు, పైల బలరాం, నాయకులు సూపర్‌-6 పథకాలను వివరించారు.
  • చీపురుపల్లి నటరాజ్‌ రెసిడెన్సీ వద్ద కూడా నాయకులు కేక్‌ కోశారు.
  • రాజాం మండలం శ్యాంపురం క్యాంపు కార్యాలయంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. వంగా వెంకటరావు, కిమిడి అశోక్‌కుమార్‌, గురవాన నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
  • అంతకాపల్లిలో యువత, గ్రామస్థులు ఆధ్వర్యంలో  పుట్టినరోజు  సందర్భంగా వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు.

 విజనరీ నాయకుడు..

 గంట్యాడ, గజపతినగరం, దత్తిరాజేరు, న్యూస్‌టుడే: విజనరీ నాయకుడు చంద్రబాబు అనుభవం, ఆయన నాయకత్వం ప్రస్తుతం రాష్ట్రానికి అవసరమని గజపతినగరం ఎన్డీయే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా గంట్యాడ, గజపతినగరంలో కార్యకర్తలతో కలిసి కేక్‌ కోసి, సంబరాలు జరుపుకొన్నారు. కలిశెట్టి అప్పలనాయుడు, కొండపల్లి భాస్కరరావు,  బూడి గాంధీ, మక్కువ శ్రీధర్‌  తదితరులు పాల్గొన్నారు. దత్తిరాజేరులో మండల కన్వీనరు చప్ప చంద్రశేఖర్‌ సమక్షంలో వేడుకలు జరిగాయి.

తెదేపాలో పలువురి చేరిక

బొబ్బిలి, రామభద్రపురం, న్యూస్‌టుడే: బొబ్బిలి మండలం మెట్టవలసకు చెందిన పలువురు శనివారం తెదేపాలో చేరారు. కోటలో జరిగిన కార్యక్రమంలో కూటమి అభ్యర్థి బేబినాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు వారికి కండువా వేశారు. కోట రామకృష్ణ, కర్రి రాము, శంకరరావు, కోట తిరుపతి, కర్రి సూర్యారావు, కర్రి రాముడు, శ్రీను తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. సర్పంచి పువ్వల మాధవరావు, కెల్ల సత్యనారాయణ పాల్గొన్నారు.

  • ఈనెల 22న ఉదయం 10 గంటలకు నామపత్రం దాఖలు చేయనున్నట్లు బేబినాయన వెల్లడించారు.  సాయంత్రం పట్టణంలో భారీ ర్యాలీ ఉంటుందన్నారు.
  • రామభద్రపురంలో రాష్ట్ర  కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ, మండలాధ్యక్షుడు కరణం భాస్కరరావు ఆధ్వర్యంలో కేకు కత్తిరించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని