logo

బస్సులన్నీ సీఎం సభకే

ముఖ్యమంతి జగన్‌మోహన్‌రెడ్డి సభలకు ఆర్టీసీ బస్సులను తరలిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Published : 21 Apr 2024 05:15 IST

మండుటెండలో ప్రయాణికుల అవస్థలు

 విజయనగరం కోట, న్యూస్‌టుడే: ముఖ్యమంతి జగన్‌మోహన్‌రెడ్డి సభలకు ఆర్టీసీ బస్సులను తరలిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  జిల్లా నుంచి శుక్రవారం కాకినాడకు 45 సర్వీసులు వెళ్లగా.. శనివారం అనకాపల్లి సభ కోసం ఏకంగా 90 బస్సులను పంపించారు. ఇందులో విజయనగరం, ఎస్‌.కోట డిపోల నుంచే 50 శాతానికి పైగా ఉన్నాయి. దీంతో రెండు డిపోల వద్ద ప్రయాణికులు గంటల తరబడి ఎండలో నిల్చున్నారు. కొన్ని సర్వీసులు అందుబాటులో ఉన్నా గమ్యస్థానాలు చేరేందుకు గంట నుంచి రెండు గంటల సమయం పట్టిందని కొందరు ప్రయాణికులు మండిపడ్డారు. పార్వతీపురం మన్యం నుంచి 128 బస్సులను తరలించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని