logo

22 నుంచి ప్రజాగళం

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు

Published : 21 Apr 2024 05:17 IST

హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌

మాట్లాడుతున్న అదితి గజపతిరాజు

ఈనాడు-విజయనగరం, న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 22న సాయంత్రం ఆరు గంటలకు శృంగవరపుకోటకు చేరుకుంటారు. ప్రచారం అనంతరం అక్కడే బస చేసే అవకాశం ఉంది. 23న ఉదయం 11 గంటలకు గజపతినగరం వెళ్లి, మహిళలతో సమావేశమవుతారు. 24న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి మధ్యాహ్నం 3 గంటలకు నెల్లిమర్ల చేరుకుంటారు. అక్కడి నుంచి విజయనగరంలోని బాలాజీ కూడలిలో జరిగే ప్రజాగళం సభలో పాల్గొంటారు. ఈ మేరకు విజయవంతం చేయాలని కూటమి విజయనగరం నియోజకవర్గ అభ్యర్థిని అదితి గజపతిరాజు కోరారు. అశోక్‌ బంగ్లాలో శనివారం నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని