logo

గర్భిణుల ఆరోగ్యంపై శ్రద్ధ

గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఎంహెచ్‌వో బి.జగన్నాథరావు ఆదేశించారు. పాలకొండ, వీరఘట్టం మండలాల్లోని పీహెచ్‌సీల వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు

Published : 21 Apr 2024 05:20 IST

సూచనలిస్తున్న డీఎంహెచ్‌వో జగన్నాథరావు

 పాలకొండ, న్యూస్‌టుడే: గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఎంహెచ్‌వో బి.జగన్నాథరావు ఆదేశించారు. పాలకొండ, వీరఘట్టం మండలాల్లోని పీహెచ్‌సీల వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కాన్పు జరిగే వరకు గర్భిణులపై ఆరోగ్య పర్యవేక్షణ ఉండాలన్నారు. తనిఖీలు, పరీక్షల వివరాలు పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొదటి కాన్పు, ఆడబిడ్డ రెండో కాన్పునకు పీఎంఎంవీవైలో రూ.5 వేలు, జేఎస్‌వైలో రూ.వెయ్యి ఇస్తున్నట్లు ప్రచారం చేయాలన్నారు. డీఐవో నారాయణరావు, డీఎంవో టి.జగన్‌మోహన్‌రావు, ఆర్బీఎస్‌కే, ఎఫ్డీ ప్రోగ్రాం అధికారులు డా.రఘుకుమార్‌, డా.ఎం.వినోద్‌కుమార్‌, ఎపిడిమియాలజిస్ట్‌ డా.శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని