logo

వైకాపా మండల కన్వీనర్‌ కారులో వాచ్‌లు, సామగ్రి

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైకాపా నాయకుడు కారులో తరలిస్తున్న సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 21 Apr 2024 05:21 IST

పార్వతీపురం పట్టణం, గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైకాపా నాయకుడు కారులో తరలిస్తున్న సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ దినకర్‌ వివరాల మేరకు.. చినబొండపల్లి వద్ద పోలీసులు శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో పార్వతీపురం మండల పార్టీ కన్వీనర్‌ బి.రమేశ్‌ కారును తనిఖీ చేయగా.. 21 వాచ్‌లు, 150 వైకాపా జెండాలు, మూడు చీరలు, 420 రిస్ట్‌ బెల్ట్‌లు, 5 తువ్వాళ్లు, 9 టోపీలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిబంధనల మేరకు చర్యలు చేపడతామని తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని