logo

కాలువలు నిర్మించారు.. కుళాయిలు మూసేశారు!

బలిజిపేట మండల కేంద్రానికి శివారున ఉన్న గంగాడ గ్రామంలోని కోమటివీధి, షరాబులవీధుల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఆ వీధిప్రజలు ఆ సమస్యను ఈనాడు జనవాణికి సమాచారమందించారు.

Published : 21 Apr 2024 17:14 IST

బలిజిపేట: బలిజిపేట మండల కేంద్రానికి శివారున ఉన్న గంగాడ గ్రామంలోని కోమటివీధి, షరాబులవీధుల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఆ వీధిప్రజలు ఆ సమస్యను ఈనాడు జనవాణికి సమాచారమందించారు. ఈ రెండు వీధుల్లో వీధి కాలువలు నిర్మించిన సమయంలో పంచాయతీ అధికారులు ఈ ప్రదేశంలో ఉన్న కుళాయిలను, వాటి పైపులను కప్పేశారు. దీంతో ఈ రెండు వీధుల్లోని ప్రజలకు తాగునీటి కోసం పక్క వీధులకు వెళ్లాల్సి వస్తోందని, ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలని వారు తెలియజేశారు. ఈ అంశంపై ఎంపీడీవో రమేష్‌నాయుడును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా, ఈ కాలువలను పరిశీలించి, తదుపరి చర్యలు చేపడతామన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని