logo

ముమ్మరంగా వాహన తనిఖీలు

ఎన్నికల నామినేషన్ల నోటిఫికేషన్‌ విడుదల చేసిన అనంతరం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.

Published : 21 Apr 2024 17:45 IST

బలిజిపేట: ఎన్నికల నామినేషన్ల నోటిఫికేషన్‌ విడుదల చేసిన అనంతరం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు ధనం, మద్యం, సామగ్రిని అక్రమంగా తరలించకుండా ఉండేందుకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీ బృందాలను ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా బలిజిపేట మండలంలోని వెంగాపురం సంతతోట కూడలి వద్ద రెవెన్యూ, ప్రత్యేక పోలీసు అధికారుల బృందంతో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఆదివారం ఎస్‌ఐ పాపారావు, రెవెన్యూ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేశారు. ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను తనిఖీ చేసి వాటి పత్రాలను, వాహనాల్లో ఉన్న సామగ్రిని పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని