logo

అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్‌

పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్‌  వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు.

Published : 25 Apr 2024 04:12 IST

ఆర్వో శుభమ్‌ బన్సల్‌కు నామపత్రం అందజేస్తున్న జయకృష్ణ

సీతంపేట, పాలకొండ, న్యూస్‌టుడే: పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్‌  వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. అక్కడ వారపు సంత కూడలి నుంచి ప్రధాన రహదారి మీదుగా తెదేపా, జనసేన, భాజపా శ్రేణులతో భారీ ర్యాలీగా ఐటీడీఏ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ప్రతిపాదకులతో కలసి జయకృష్ణ లోపలికి వెళ్లి నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.హెచ్‌.శుభమ్‌ బన్సల్‌కు నామపత్రాలను అందజేశారు. పాలకొండ డీఎస్పీ జి.వి.కృష్ణారావు ఆధ్వర్యంలో సీఐ ఎం.చంద్రమౌళి, ఎస్సై జగదీశ్‌నాయుడు తదితరులు బందోబస్తు నిర్వహించారు.

సీతంపేటలో ఐటీడీఏ కార్యాలయానికి కూటమి కార్యకర్తల ర్యాలీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని