logo

లలితకుమారి నామపత్రం దాఖలు

శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఉదయం ఎల్‌.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్‌.కోటకు చేరుకున్నారు.

Published : 25 Apr 2024 04:16 IST

ఎస్‌.కోటలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ అందజేస్తున్న లలితకుమారి

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఉదయం ఎల్‌.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్‌.కోటకు చేరుకున్నారు. ఆకులడిపో నుంచి పార్టీ శ్రేణులతో కలసి దుర్గాదేవి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్‌ అధికారి పి.మురళీకృష్ణకు మూడు సెట్ల నామపత్రాలు అందజేశారు. కొట్యాడ రమణమూర్తి, బొబ్బిలి అప్పారావు, కర్రెడ్లు ఈశ్వరరావు ప్రతిపాదించారు. డమ్మీగా తల్లి గొంప సత్యవతి నామినేషన్‌ వేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఐ.సుధారాజు, జనసేన నాయకుడు సత్యనారాయణ, భాజపా నాయకురాలు జగదీశ్వరి, కోళ్ల రాంప్రసాద్‌, గొంప దుర్గాఉమేష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని