logo

వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..

కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి, జేసీ కె.కార్తీక్‌కు నామపత్రాలు అందించారు.

Published : 25 Apr 2024 04:20 IST

అదితికి పుష్పగుచ్ఛం అందిస్తున్న ఎంపీ అభ్యర్థి అప్పలనాయుడు దంపతులు

విజయనగరం గ్రామీణం, అర్బన్‌, న్యూస్‌టుడే: కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి, జేసీ కె.కార్తీక్‌కు నామపత్రాలు అందించారు. తండ్రి అశోక్‌ గజపతిరాజు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, భాజపా రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని తదితరులు పాల్గొన్నారు.

నిరాడంబరంగా..

నామినేషన్‌కు ముందు తన కుటుంబ సభ్యులతో కలిసి పైడితల్లి, కోటలోని ఆంజనేయస్వామి, సరస్వతీదేవి ఆలయాలను దర్శించుకున్నారు. ఇంట్లో సింహాచలం దేవస్థానం వేదపండితుల ఆశీర్వాదం పొందారు. బంగ్లాలో ఏర్పాటు చేసిన వేదికపై ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తల్లిదండ్రులు అశోక్‌ గజపతిరాజు, సునీలా గజపతిరాజు, కుటుంబ సభ్యుల ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఉదయం 10.15 గంటల సమయంలో ర్యాలీగా వెళ్లారు. ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, ఆర్‌.పి.భంజ్‌దేవ్‌, ఐవీపీ.రాజు, ప్రసాదుల కనకమహాలక్ష్మి, విజ్జపు ప్రసాద్‌, ఎం.నారాయణప్పడు, వరప్రసాద్‌, బంగారుబాబు,  నర్సింగరావు, పోలినాయుడు, రాజేష్‌బాబు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని