logo

నారాయణపురం ఆనకట్ట వెలవెల

సంతకవిటి మండలంలోని నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట ఇది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని 50 వేల ఎకరాలకు సాగునీరుతో పాటు పలు మండలాల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్టుది కీలక భూమిక.

Published : 20 May 2024 03:34 IST

ప్రాజెక్టు ప్రధాన కట్ట వద్ద కానరాని నీటి ప్రవాహం

సంతకవిటి మండలంలోని నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట ఇది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని 50 వేల ఎకరాలకు సాగునీరుతో పాటు పలు మండలాల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్టుది కీలక భూమిక. అటువంటి ప్రాజెక్టు నీరు లేక వెలవెలబోతుండటంతో వేసవిలో తాగు, సాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడితే తప్ప నాగావళి నదిలోనికి నీటి ప్రవాహం వచ్చే అవకాశం లేదని జలవనరుల శాఖ ఏఈ జీవీ.రమణ తెలిపారు.

న్యూస్‌టుడే, సంతకవిటి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని