logo

సాగుకు సమాయత్తం

తొలకరికి ముందే వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈమేరకు విత్తనాలను అందించేందుకు విత్తనాభివృద్ధి సంస్థ సైతం సమయాత్తమవుతోంది.

Published : 20 May 2024 03:39 IST

విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసిన వరి విత్తనాల బస్తాలు

విజయనగరం వ్యవసాయవిభాగం, పార్వతీపురం, న్యూస్‌టుడే: తొలకరికి ముందే వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈమేరకు విత్తనాలను అందించేందుకు విత్తనాభివృద్ధి సంస్థ సైతం సమయాత్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలోని మండలాల వారీగా కేటాయింపుల ప్రకారం బస్తాలను సమకూరుస్తోంది. రెండు జిల్లాల్లో 72,947 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని సంస్థ పేర్కొంటోంది. ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే రైతుల చెంతకు చేర్చాలని భావిస్తోంది. అందులో భాగంగా మొలక శాతాన్ని పరిశీలిస్తూ, శుద్ధి చేసి బస్తాల్లో ప్యాకింగ్‌ చేసే పనుల్లో ఏపీ సీడ్స్‌ తీరిక లేకుండా ఉంది. రాయితీని మాత్రం ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.

రెండు జిల్లాల్లో ఇలా..

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఖరీఫ్‌ సీజన్‌లో 1,63,698 హెక్టార్లలో వరి సాగు చేయించేందుకు వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. విజయనగరం జిల్లాలో 90,811 హెక్టార్లు, మన్యంలో 72,887 హెక్టార్లుగా నిర్ణయించింది. అందులో భాగంగా 46,531, 26,416 క్వింటాళ్ల చొప్పున వివిధ రకాల విత్తనాలు అందించనున్నారు.

మొలకశాతం పరిశీలనకు ప్రత్యేక ఏర్పాట్లు ఇలా.. 

మూడు చోట్ల నిల్వ కేంద్రాలు..

  • నెలివాడలోని గోదాము నుంచి విజయనగరం, బొండపల్లి, గజపతినగరం, మెంటాడ, గంట్యాడ, చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మొరకముడిదాం, రాజాం, సంతకవిటి, రేగిడి ఆమదాలవలస, వంగర మండలాలకు విత్తనాలు సరఫరా చేయనున్నారు.
  • కొత్తవలస నుంచి ఎస్‌.కోట, ఎల్‌.కోట, కొత్తవలస, జామి, వేపాడ

సాలూరులోని నిల్వ కేంద్రం ద్వారా సాలూరు, మక్కువ, పాచిపెంట, రామభద్రాపురం, బొబ్బిలి, బాడంగి, తెర్లాం, భామిని, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, పార్వతీపురం, కురుపాం, జి.ఎల్‌.పురం, గురుగుబిల్లి, సీతానగరం మండలాలకు సరకు చేరనుందని ఏపీ సీడ్స్‌ ప్రబంధకురాలు ఎస్‌.పద్మ తెలిపారు. స్టాక్‌ పాయింట్లలో నిల్వలను సిద్ధం చేస్తున్నామని, అక్కడి నుంచి రైతు భరోసా కేంద్రాలకు పంపిస్తామన్నారు. జూన్‌ మొదటి వారంలో పంపిణీకి చర్యలు చేపడతామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని