logo

పట్టాలిచ్చినా ప్రయోజనం శూన్యం

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని పేద, మధ్యతరగతి ప్రజలకు గ్రామీణ మండలంలోని కొండకరకం సమీపంలోని ఓ కొండపై జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. ఇక్కడ నాలుగేళ్ల కిందట దాదాపు 2,500 మందికిపైగా లబ్ధిదారులకు పట్టాలిచ్చారు.

Published : 20 May 2024 03:43 IST

జగనన్న కాలనీలో పునాదులకే పరిమితం అయిన ఇళ్ల నిర్మాణ పనులు

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని పేద, మధ్యతరగతి ప్రజలకు గ్రామీణ మండలంలోని కొండకరకం సమీపంలోని ఓ కొండపై జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. ఇక్కడ నాలుగేళ్ల కిందట దాదాపు 2,500 మందికిపైగా లబ్ధిదారులకు పట్టాలిచ్చారు. ఇక్కడి స్థలాల కొనుగోళ్లకు రూ.24 కోట్ల మేర ఖర్చు చేశారు. కొన్ని ఇళ్లను థర్డ్‌ పార్టీ(నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో పనులు) కింద నిర్మించాల్సి ఉంది. మరికొందరు సొంతంగా పనులు చేసేందుకు ముందుకొచ్చారు. కొండపైన, కింద స్థలాలు కేటాయించడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వాహనాలు, నిర్మాణ సామగ్రి తరలింపునకు లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. థర్డ్‌ పార్టీ నిర్మాణ సంస్థ కొంతమేర పనులు చేసి, మధ్యలోనే వదిలేసింది. ఇప్పటివరకు అటువైపు కూడా చూడలేదు. సొంతంగా పనులు చేసుకున్నవారిలో కొందరు గృహాలు పూర్తిచేశారు. వారివి కూడా కొండ కిందున్నవే. కొండపైన చదును చేసేందుకు వీలు కావడం లేదు. బండరాళ్లు ఉండడంతో ఆగిపోయారు. ప్రస్తుతం అక్కడెవరూ కానరావడం లేదు. కనీస సౌకర్యాలు కూడా లేవు. వేరే ప్రాంతంలో పట్టాలు ఇవ్వాలని ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు చెబుతున్నారు.

న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం

కొండకరకంలో కొండలను తవ్వలేక చదును పనులను ఇలా మధ్యలోనే వదిలేసిన లబ్ధిదారులు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని