logo

వారధి కిందే అక్రమ తవ్వకాలు

ఎన్నికల అనంతరం అధికార యంత్రాంగంలో నెలకొన్న స్తబ్ధతను సైతం అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. సంతకవిటి మండలం రంగరాయపురం సమీపంలోని నాగావళి నదిపై ఉన్న వంతెన కాంక్రీటు పిల్లర్ల వద్ద యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు.

Published : 20 May 2024 03:58 IST

వంతెన కింద నుంచి ట్రాక్టర్లతో తరలిస్తున్న ఇసుక

న్యూస్‌టుడే, సంతకవిటి: ఎన్నికల అనంతరం అధికార యంత్రాంగంలో నెలకొన్న స్తబ్ధతను సైతం అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. సంతకవిటి మండలం రంగరాయపురం సమీపంలోని నాగావళి నదిపై ఉన్న వంతెన కాంక్రీటు పిల్లర్ల వద్ద యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. వీటి వల్ల వంతెన బలహీనపడుతుందని తెలిసినా ఆపడం లేదు. వారధికి వంద మీటర్ల దూరంలో ఎటువంటి తవ్వకాలు చేయకూడదని, పిల్లర్ల సమీపంలోనే ఇసుకను తోడేస్తున్నందున పోలీసు, రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని రభ శాఖ ఈఈ రవినాయక్‌ తెలిపారు.    

రంగరాయపురం వద్ద నాగావళి నదిపై ఉన్న  వంతెన కింద నుంచి ఇసుక తరలింపు

వంతెన పిల్లర్ల వద్ద  తవ్వకాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని