logo

అలజడి సృష్టించిన భారీ క్రేన్‌

కొత్తవలస కూడలికి సమీపంలో ఓ భారీ క్రేన్‌ సోమవారం ఉదయం అలజడి సృష్టించింది. విశాఖపట్నం మార్గంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చెక్‌పోస్టుకు ఎదురుగా రహదారికి ఆనుకుని ఉన్న షెడ్లులోకి దూసుకుపోయింది.

Published : 28 May 2024 03:24 IST

ధ్వంసమైన షెడ్లు 

కొత్తవలస, న్యూస్‌టుడే: కొత్తవలస కూడలికి సమీపంలో ఓ భారీ క్రేన్‌ సోమవారం ఉదయం అలజడి సృష్టించింది. విశాఖపట్నం మార్గంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చెక్‌పోస్టుకు ఎదురుగా రహదారికి ఆనుకుని ఉన్న షెడ్లులోకి దూసుకుపోయింది. దీనివల్ల ఒక మెకానికల్‌ షెడ్, మరో రెండు షెడ్లు ధ్వంసమయ్యాయి. ఒక పాత ద్విచక్ర వాహనం దెబ్బతింది. ప్రమాద సమయంలో షెడ్లలో ఎవరూ లేరు. లేదంటే పరిస్థితి ఎలా ఉండేదోనని స్థానికులు కలవర పడ్డారు. రహదారి పక్కన ఆగివున్న ఆటోను తప్పించే సమయంలో క్రేన్‌ అదుపుతప్పి షెడ్లలోకి దూసుకుపోయిందని స్థానికులు చెబుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని