logo

గౌరవ వేతనం చెల్లింపులకు ఉత్తర్వులు

ఎన్నికల విధులు నిర్వహించిన బృందాలకు గౌరవ వేతనం చెల్లింపుల కోసం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 28 May 2024 03:26 IST

కొత్తవలస, న్యూస్‌టుడే: ఎన్నికల విధులు నిర్వహించిన బృందాలకు గౌరవ వేతనం చెల్లింపుల కోసం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి వీలుగా జిల్లాలో ఎంసీసీ, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, వీఎస్‌టీ, వీవీటీ, ఏటీ, ఈఈఎం బృందాలను ఏర్పాటు చేశారు. ఇంతకాలం వీరికి పారితోషికం చెల్లింపు విషయంలో నెలకొన్న సందిగ్ధత తొలగింది. వీటిలో కొన్ని బృందాలు నోటిఫికేషన్‌ నుంచి, మరికొన్ని నామినేషన్లు ప్రారంభం నుంచి విధుల్లో పాల్గొన్నాయి.  వీరికి గౌరవ వేతనం ఆర్వోలు/సహాయ ఆర్వోలు ఒకే విధంగా చెల్లించడం లేదని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఏకమొత్తంగా ప్రతిపాదించారు. దీని ప్రకారం సెక్టర్‌ అధికారులకు రూ.15 వేలు, రిజర్వులో ఉన్న సెక్టర్‌ అధికారులు ఒక్కొక్కరికి రూ.8 వేలు చొప్పున, ఎఫ్‌ఎస్‌టీ (ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీం), ఎస్‌ఎస్‌టీ, వీఎస్‌వీ, ఎంసీసీ, ఏటీ, వీవీటీ, ఈఈఎం టీం లీడర్లకు రూ.10 వేల చొప్పున, సభ్యులకు రూ.8 వేల చొప్పున, రిజర్వులో ఉన్న వారికి రూ.6 వేల చొప్పున ప్రతిపాదించారు. ఏఈఓకి రూ.10 వేలు, రిజర్వులో ఉన్న వారికి రూ.6 వేలు చెల్లించాలని పేర్కొన్నారు. జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీం హెడ్‌కి రూ.10 వేలు, సభ్యులకు రూ.8 వేలు చెల్లించాలని తెలిపారు. వీఎస్‌టీ టీంలో లీడరుగా పనిచేసిన పీసీకి రూ.10 వేలు, సభ్యులకు(పీసీలు) రూ.8 వేలు, రిజర్వులో ఉన్నవారికి రూ.6 వేలు చెల్లించాలని ప్రతిపాదించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని