logo

ప్రయాణికుల చరవాణులపైనే గురి!

జల్సాల కోసం సెల్‌ఫోన్లు, మోటారు సైకిళ్లు దొంగిలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ప్రత్తిపాడు పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 54 చరవాణులతో పాటు, 9 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Updated : 07 Feb 2023 06:58 IST

54 సెల్‌ఫోన్లు, 9 వాహనాల స్వాధీనం

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: జల్సాల కోసం సెల్‌ఫోన్లు, మోటారు సైకిళ్లు దొంగిలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ప్రత్తిపాడు పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 54 చరవాణులతో పాటు, 9 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.13.52 లక్షలు ఉంటుందని సీఐ కిశోర్‌బాబు తెలిపారు. సోమవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. తుని గ్రామీణ మండలం కొలిమేరుకు చెందిన బొందల అప్పారావు, ఎస్‌.కోట మండలం కొత్తవలసకు చెందిన బోధల సురేష్‌ తుని, అన్నవరం, సామర్లకోట రైల్వేస్టేషన్లలో మకాం వేసి, చోరీలకు అలవాటు పడ్డారు. రైల్లో ప్రయాణాలు చేసి ఛార్జింగ్‌ పెట్టుకున్న ఫోన్లను వీరు దొంగిలించేవారు. యూట్యూబ్‌, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఫోన్ల లాక్‌లను తెరవడం, వాటి డేటాను తొలగించి విక్రయించడానికి అలవాటు పడ్డారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తూ ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్లేవారు. వాటిని అమ్మి, ఆ నగదుతో జల్సాలు చేసేవారు. అన్నవరం పరిసరాల్లో అద్దె గదిలో ఉండగా.. తమకు అందిన సమాచారం మేరకు అరెస్టు చేశామని సీఐ చెప్పారు. అప్పారావు నుంచి ఒక మోటారు సైకిల్‌, 6 చరవాణులు, సురేష్‌  నుంచి 48 చరవాణులు, 8 బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. చోరీకి గురైన ఫోన్లకు సాంకేతిక సహకారం అందించిన వ్యక్తుల సమాచారం సేకరిస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని