logo

ప్రయోగ పరీక్షలకు డిగ్రీ అధ్యాపకులు

ఇంటర్మీడియట్‌ ప్రయోగ పరీక్షల్లో తొలిసారిగా డిగ్రీ అధ్యాపకుల సేవలను వినియోగించుకునేలా ఉన్నత విద్యాశాఖ మండలి అనుమతి  ఇచ్చింది. ఇంటర్‌ బోర్డు విజ్ఞప్తి మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Updated : 07 Feb 2023 03:29 IST

చీపురుపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ ప్రయోగ పరీక్షల్లో తొలిసారిగా డిగ్రీ అధ్యాపకుల సేవలను వినియోగించుకునేలా ఉన్నత విద్యాశాఖ మండలి అనుమతి  ఇచ్చింది. ఇంటర్‌ బోర్డు విజ్ఞప్తి మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఇంటర్‌ ప్రయోగ పరీక్షల్లో మార్పులు చేసిన సంగతి విదితమే. ఈ ఏడాది పది రోజుల్లోనే ప్రయోగ పరీక్షలు పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సరిపడా సిబ్బంది లేని కారణంగా డిగ్రీ తరగతులు బోధిస్తున్న భౌతిక, రసాయన శాస్త్రాల అధ్యాపకుల సేవలను వినియోగించుకోవడానికి బోర్డు విజ్ఞప్తిపై ఉన్నత విద్యామండలి సానుకూలంగా స్పందించింది. ఆ మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల వివరాలను పంపారు. ఈ విషయంపై ఆర్జేడీ సత్యనారాయణ మాట్లాడుతూ ఉన్నత విద్యామండలి అనుమతించిన మేరకు ఎక్కడ అవసరమైతే అక్కడ డిగ్రీ అధ్యాపకుల సేవలను వినియోగించుకుంటామని ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

ఉమ్మడి జిల్లాల్లో ఇదీ పరిస్థితి... 
విద్యార్థులు: 29,444
పరీక్షా కేంద్రాలు: 155  
పార్వతీపురం మన్యంలో : 44
విజయనగరంలో: 111  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని