logo

మావయ్యా.. ఇదేం మాయ

‘బంగారు కొండవయ్య.. మా జగన్‌ మావయ్యా’ ప్రతి సభలోనూ.. ప్రతి కార్యక్రమంలోనూ విద్యార్థులతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇలా డప్పు కొట్టించుకుంటూనే ఉన్నారు.

Updated : 03 Apr 2024 05:42 IST

వైకాపా వచ్చాక విజ్ఞాన యాత్రలు శూన్యం

గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: ‘బంగారు కొండవయ్య.. మా జగన్‌ మావయ్యా’ ప్రతి సభలోనూ.. ప్రతి కార్యక్రమంలోనూ విద్యార్థులతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇలా డప్పు కొట్టించుకుంటూనే ఉన్నారు. విద్యా రంగానికి ఎన్నో చేశామని చెప్పి.. మాయ చేశారు. ఆ రంగాన్నే నిస్తేజంగా మార్చేశారు. ఈక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వారి కోసం చేపట్టాల్సిన విజ్ఞాన, విహార యాత్రలను పూర్తిగా విస్మరించారు. ఐదేళ్లుగా నిర్వహణకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం వీటికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పించింది.

 నాడు ఉల్లాసం.. నేడు నీరసం

తొమ్మిదో తరగతి విద్యార్థుల కోసం గత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్‌ ద్వారా విజ్ఞాన యాత్రలు సాగేవి. ఒక్కో విద్యార్థికీ రూ.200 చొప్పున కేటాయించేది. పాఠ్యాంశాలకు సంబంధించిన, ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలను ఉపాధ్యాయులు చూపించేవారు. వైకాపా వచ్చిన కొత్తలో ప్రారంభిస్తారని అంతా భావించారు. కానీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తలేదు. ఈలోపు కరోనా రావడంతో క్షేత్రస్థాయి నుంచి ప్రతిపాదనలు సైతం వెళ్లలేదు. దీంతో నిధుల మంజూరు ఆగిపోయింది.

జిల్లాలో ఇలా..

మన్యం జిల్లాలో మొత్తం 1698 పాఠశాలలున్నాయి. వీటిలోని 227 ఉన్నత పాఠశాలల్లో 28 వేల మంది తొమ్మిదో తరగతి చదువుతున్నారు. వీరందరినీ క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సి ఉంది. దీనిపై డీఈవో పగడాలమ్మను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. పైనుంచి ఎలాంటి ఆదేశాలు లేవని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని