logo

నిరాశాజనకంగా ఇంటర్‌ ఫలితాలు

ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో తాళ్లూరులోని వీకే ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 86.67 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలవగా.. తురిమెళ్ల కళాశాల 85.22 శాతంతో ద్వితీయ, అర్థవీడు కళాశాల 83.33 శాతంతో మూడోస్థానం దక్కించుకున్నాయి.

Published : 13 Apr 2024 02:06 IST

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో తాళ్లూరులోని వీకే ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 86.67 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలవగా.. తురిమెళ్ల కళాశాల 85.22 శాతంతో ద్వితీయ, అర్థవీడు కళాశాల 83.33 శాతంతో మూడోస్థానం దక్కించుకున్నాయి. తక్కువ శాతం ఉత్తీర్ణత సాధించిన కళాశాలల్లో యర్రగొండపాలెం 29 శాతం, కొమరోలు 30.95 శాతం, ఒంగోలు 33.96 శాతం ఉన్నాయి. జూనియర్‌ ఇంటర్‌ ఫలితాల్లో తురిమెళ్ల ప్రభుత్వ కళాశాల 56.72 శాతంతో ప్రథమ, పీసీపల్లి 53.57 శాతంతో ద్వితీయ, దర్శి 42.74 శాతంతో తృతీయ స్థానాల్లో నిలిచాయి. అతి తక్కువ మంది ఉత్తీర్ణులైన కళాశాలల్లో యర్రగొండపాలెం జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు 16.04 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ఉప్పుగుండూరు 16.67, ఒంగోలు కళాశాలలో 20 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ కళాశాలల్లో రెగ్యులర్‌ బోధకులు లేనందునే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదని సమాచారం. పోస్టుల భర్తీ నిలిచిపోవడంతో అతిథి అధ్యాపకులకు గంటల లెక్కన వేతనం చెల్లించి చదువు చెప్పించారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపలేకపోయారు. ఫలితంగా కొన్ని కళాశాలల్లో 30 శాతంలోపే ఉత్తీర్ణత పడిపోయినట్లు సీనియర్‌ అధ్యాపకులు చెబుతున్నారు.

జూనియర్‌ 18, సీనియర్‌ ఇంటర్‌లో 15వ స్థానం.. : ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 18వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 15వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది. జూనియర్‌ ఇంటర్‌లో 18,349 మంది పరీక్ష రాయగా 10,868 మంది (59.2 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌ కోర్సుల్లో 1,929 మంది పరీక్షలు రాయగా 1,032 మంది (58.7 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం జనరల్‌ కోర్సులో 1,5238 మంది పరీక్ష రాయగా 10993 మంది (72శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌ కోర్సుల్లో 2001 మందికి గాను 1373 మంది (68.6శాతం) ఉత్తీర్ణత సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు