logo

ఆదరించండి.. అండగా ఉంటాం

అందరించండి. అండగా ఉంటామని యర్రగొండపాలెం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు, తెదేపా యువనేత మాగుంట రాఘవరెడ్డి పేర్కొన్నారు. త్రిపురాంతకం మండలంలో శుక్రవారం ప్రచార రథంలో ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టారు.

Published : 13 Apr 2024 02:13 IST

త్రిపురాంతకంలో ప్రచారం నిర్వహిస్తున్న ఎరిక్షన్‌బాబు, రాఘవరెడ్డి

త్రిపురాంతకం, గిద్దలూరు పట్టణం, తర్లుపాడు, బేస్తవారపేట, పెద్దారవీడు, న్యూస్‌టుడే: అందరించండి. అండగా ఉంటామని యర్రగొండపాలెం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు, తెదేపా యువనేత మాగుంట రాఘవరెడ్డి పేర్కొన్నారు. త్రిపురాంతకం మండలంలో శుక్రవారం ప్రచార రథంలో ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టారు. వైకాపా పాలనకు అంతం పలకాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.ఎరిక్షన్‌బాబు కుటుంబం త్రిపురాంతకంలో ప్రచారంలో నిర్వహించారు. డా.మన్నే రవీంద్రతో కలిసి ఎరిక్షన్‌బాబు కుమార్తె డా.చెల్సియా, కుమారుడు అజిత్‌, సోదరి కేథరిన్‌తో పాటు పలువురు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

  • ఇంటింటికి కందుల నారాయణరెడ్డి’ అనే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తర్లుపాడు మండలంలో రోహిత్‌రెడ్డి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా పోతలపాడు గ్రామపంచాయతీలోని 15 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపా తీర్థం పుచుకున్నారు.
  • ఓటమి భయంతోనే వైకాపా దుస్పృచారం చేపడుతోందని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం గిద్దలూరు మండలంలోని పలు గ్రామంలో ఇంటింటికి తెదేపా చేపట్టిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
  • బేస్తవారపేట పంచాయతీలోని ఇస్లాంపేట, మెయిన్‌ బజార్‌లలో  ముత్తుముల అశోక్‌రెడ్డి సోదరి గీతా భవాని నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.‌
  • గిద్దలూరు నగర పంచాయతీలోని 7 వార్డులో ముత్తుముల అశోక్‌రెడ్డి సతీమణి పుష్పలీల ఇంటింటికి తెదేపా కార్యక్రమంలో పాల్గొన్నారు.
  • పెద్దారవీడు మండలంలోని బద్వీడు చెర్లోపల్లి గ్రామానికి చెందిన వైకాపా నాయకులు బొచ్చు వెంకటేశ్వరరెడ్డి తోపాటు 65 కుటుంబాలు  ఎరిక్షన్‌బాబు, మాగుంట రాఘవరెడ్డి సమక్షంలో తెదేపాలో చేరాయి.

గిద్దలూరులో మహిళలను ఓట్లు అభ్యర్థిస్తున్న  తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి

తర్లుపాడు : పార్టీలో చేరిన  వైకాపా నాయకులకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వాస్తున్న రోహిత్‌రెడ్డి

గిద్దలూరులో ఇంటింటి ప్రచారం చేపడుతున్న మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి సతీమణి పుష్పలీల

పెద్దారవీడు : పార్టీలో చేరిన చెర్లోపల్లి గ్రామస్థులతో మాగుంట రాఘవరెడ్డి, ఎరిక్షన్‌బాబు, కందుల రామిరెడ్డి

త్రిపురాంతకంలో ఓట్లు అభ్యర్ధిస్తున్న ఎరిక్షన్‌బాబు కుమార్తె  చెల్సియా, కటుంబ సభ్యులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని