logo

మాయమాటలు చెప్పడంలో మంత్రి దిట్ట

కొండపి వైకాపా ఇన్‌ఛార్జిగా వచ్చిన మంత్రి సురేష్‌, తనను గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని అబద్ధపు హామీలిస్తున్నారని, ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేయడంలో ఆయన దిట్ట అని ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు.

Published : 13 Apr 2024 02:17 IST

ఐక్యత చాటుతున్న కూటమి నేతలు ఎమ్మెల్యే స్వామి, అరుణ, సత్య, షేక్‌ రియాజ్‌ తదితరులు

కొండపి గ్రామీణం, న్యూస్‌టుడే: కొండపి వైకాపా ఇన్‌ఛార్జిగా వచ్చిన మంత్రి సురేష్‌, తనను గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని అబద్ధపు హామీలిస్తున్నారని, ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేయడంలో ఆయన దిట్ట అని ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. కొండపిలోని శ్రీసాయి సీతారామ కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన తెదేపా, భాజపా, జనసేన నియోజకవర్గ ఉమ్మడి ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత మంత్రిగా ఉంటూ దళితులకు ఏం చేశావని నిలదీశారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమంతో అందరికీ అండగా నిలుస్తుందన్నారు. జనసేన జిల్లా అధికార ప్రతినిధి రావిపాటి అరుణ మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఒక్క గ్రామానికి కూడా రోడ్లు వేయని, తాగునీరు అందించలేని, ఆసుపత్రుల నిర్మాణం చేయలేని మంత్రిగా సురేష్‌ పేరు సాధించారని ఎద్దేవా చేశారు. ఒంగోలు వైకాపా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి బాస్కరరెడ్డి మన జిల్లాకు రాయలసీమ రక్తచరిత్ర అంటకట్టాలని చూస్నున్నారని మండిపడ్డారు. భాజపా నియోజకవర్గ అధ్యక్షుడు బాలకోటయ్య మాట్లాడుతూ మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు నెల రోజులు కష్టపడి ఎమ్మెల్యేగా స్వామిని, ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌, భాజపా జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, తెదేపా నియోజకవర్గ పరిశీలకుడు అడకా స్వాములు, రాయపాటి సీతమ్మ, ఆరు మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని