logo

వైకాపా జేబు సంస్థ.. జనం అవస్థలు పట్టవంట

ఏపీఎస్‌ ఆర్టీసీ అధికార పార్టీ వైకాపాకు జేబు సంస్థగా మారింది. సీఎం జగన్‌ సభలు ఎక్కడ నిర్వహించినా.. అక్కడికి పెద్ద సంఖ్యలో బస్సులను జిల్లాలు దాటి మరి కేటాయిస్తోంది.

Published : 13 Apr 2024 02:23 IST

సాయంత్రం వేళ ఒంగోలులో బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు

ఒంగోలు అర్బన్‌, న్యూస్‌టుడే: ఏపీఎస్‌ ఆర్టీసీ అధికార పార్టీ వైకాపాకు జేబు సంస్థగా మారింది. సీఎం జగన్‌ సభలు ఎక్కడ నిర్వహించినా.. అక్కడికి పెద్ద సంఖ్యలో బస్సులను జిల్లాలు దాటి మరి కేటాయిస్తోంది. అదే సమయంలో సామాన్య ప్రయాణికులను కష్టనష్టాలకు గురిచేస్తోంది. కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లా కావలి, అనంతరం ప్రకాశం జిల్లా పొదిలిలో, పిడుగురాళ్లలోని సభలకూ ఇక్కడి నుంచి మళ్లించి జనాలకు అవస్థలు మిగిల్చారు. తాజాగా గుంటూరులో శుక్రవారం నిర్వహించిన మేమంతా సిద్ధం సభకు జిల్లా రీజియన్‌లోని డిపోల నుంచి 210 బస్సులను మరోమారు కేటాయించారు. మొత్తం 471 బస్సుల్లో 210 వరకు జగన్‌ సభకు మళ్లించడంతో చాలా రూట్లలో వెతలు తప్పలేదు.

రాత్రి ఎనిమిది గంటల సమయంలో వేచి ఉన్న ఓ కుటుంబం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని