logo

15 నుంచి అభ్యర్థుల సలహాలకు సహాయ కేంద్రం

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్‌ ప్రక్రియకు సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు సహాయ కేంద్రం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ తెలిపారు.

Published : 13 Apr 2024 02:24 IST

నాయకులకు సూచనలిస్తున్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌.. చిత్రంలో ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్‌ ప్రక్రియకు సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు సహాయ కేంద్రం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఒంగోలు ప్రకాశం భవన్‌లోని స్పందన సమావేశ మందిరంలో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలతో పూర్తవుతుందన్నారు. పత్రాల సమర్పణలో ఏమైనా సందేహాలుంటే సహాయ కేంద్రంలో నుంచి సూచనలు పొందవచ్చన్నారు. ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల వారు నియమావళిని అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పోలీసు శాఖ తరఫున ఎన్నికల ఉల్లంఘనపై ఫిర్యాదుల స్వీకరణకు చరవాణి నం.91211 02266ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎన్నికల విధులపై అవగాహన అవసరం: పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొనే ప్రతి ఒక్కరూ తమ విధులపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ సూచించారు. మాస్టర్‌ ట్రైనర్లు, మెంటార్లతో ఒంగోలులో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే మొదటి విడత శిక్షణ పూర్తవగా, రెండో విడత ఈ నెల 13, 14న నిర్వహించనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని