logo

మంత్రి సురేష్‌ సతీమణిపై ఎన్నికల సంఘానికి తెదేపా ఫిర్యాదు

మంత్రి, వైకాపా కొండపి నియోజకవర్గ అభ్యర్థి ఆదిమూలపు సురేష్‌ సతీమణి అయిన ఐఆర్‌ఎస్‌ అధికారిణి విజయలక్ష్మిపై ఎన్నికల సంఘానికి తెదేపా నేతలు శనివారం ఫిర్యాదు చేశారు.

Updated : 21 Apr 2024 09:30 IST

టంగుటూరు, న్యూస్‌టుడే: మంత్రి, వైకాపా కొండపి నియోజకవర్గ అభ్యర్థి ఆదిమూలపు సురేష్‌ సతీమణి అయిన ఐఆర్‌ఎస్‌ అధికారిణి విజయలక్ష్మిపై ఎన్నికల సంఘానికి తెదేపా నేతలు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ నెల 19న మంత్రి సురేష్‌ పేరుతో ఆయన సతీమణి కొండపిలోని పలువురు వైకాపా నాయకులతో నామినేషన్‌ దాఖలు చేయించారు. ఈ ప్రక్రియ అంతటినీ ఆమె దగ్గరుండి పర్యవేక్షించారు. నామినేషన్‌ పత్రాలు సమర్పించిన అనంతరం ఆమె ఆర్వో కార్యాలయంలోకి వెళ్లారు. ప్రభుత్వ అధికారిణి అయి ఉండి నామినేషన్లు సమర్పించే ఆర్వో కార్యాలయానికి వెళ్లడంపై కూటమి తెదేపా అభ్యర్థి డోలా బాలవీరాంజనేయస్వామి, తెదేపా నాయకుడు కొర్రపాటి వీరభోగ వసంతరావులు జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ (కలెక్టర్‌), రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే స్వామి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు