logo

రోడ్లు ఛిద్రం.. ఒళ్లు హూనం

అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. ఎక్కడా ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఈ దారుల్లో ప్రయాణిస్తే ఒళ్లు హూనమవుతుందో రామచంద్రా అని ప్రజలు బాధ వెలబోసుకున్న వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు.

Published : 24 Apr 2024 03:48 IST

వైకాపా పాలనలో ప్రజలకు తప్పని అవస్థలు

వై.పాలెం త్రిపురాంతకం ఆర్‌అండ్‌బీ రోడ్డు దుస్థితి

యర్రగొండపాలెం, న్యూస్‌టుడే: అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. ఎక్కడా ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఈ దారుల్లో ప్రయాణిస్తే ఒళ్లు హూనమవుతుందో రామచంద్రా అని ప్రజలు బాధ వెలబోసుకున్న వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. నియోజకవర్గ కేంద్రమైన వై.పాలెం- త్రిపురాంతకం ఆర్‌అండ్‌బీ రహదారి గుంతలమయంగా మారింది. రాష్ట్ర రాజధానితోపాటు కీలక ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ రోడ్డే దిక్కు. ఇంతటి రద్దీ ఉండే మార్గం ఛిద్రమై జనాలను గుల్ల చేస్తోంది. డబుల్‌ రోడ్డు నిర్మాణానికి రూ.30కోట్లు మంజూరై టెండర్లు దక్కించుకున్న గుత్తేదారు సంస్థ నిర్మాణానికి ముందుకు రాలేదు. ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతో టెండరు దక్కించుకున్నా పనులు మొదలుపెట్టలేదు. రాష్ట్ర మంత్రి హోదాలో అయిదేళ్లు పనిచేసిన ఆదిమూలపు సురేష్‌ కనీసం ఈ రోడ్డు వేయించలేకపోయారని జనం ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

  • వై.పాలెం- పుల్లలచెరువు అర్‌అండ్‌బీ రోడ్డును సైతం డబుల్‌ రోడ్డు చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి సురేష్‌ అనంతరం పత్తా లేకుండా పోయారు. ఇచ్చి హామీని నిలబెట్టుకోవడంలో విఫలమై ప్యాచ్‌ వర్కులు చేయించి చేతులు దులుపుకున్నారు. పుల్లలచెరువు నుంచి ముటుకుల వెళ్లే బీటీ రహదారి గోతులు ఏర్పడి వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. ఎలక్షన్‌ నోటిఫికేషన్‌కు ముందు ప్యాచ్‌ వర్కులు మొదలుపెట్టి మమ అనిపిస్తున్నారు.
  • ఏఐఐడీ బ్యాంకు నిధులతో తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన 21 బీటీ రోడ్లను పూర్తిచేయకుండా వదిలేశారు. నేటికీ ఆరోడ్లు గోతుల మయమై దర్శనమిస్తున్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని